భారతీయులు భిన్న కళాకారులు అని ఏ మహానుభావుడు అన్నాడోగానీ, మనవాళ్ళు వివిధ రంగాలలో తమ ప్రతిభను కనబరుస్తూ వుంటారు.అయితే దీనికి చదువుతో పనేమిటని కొందరు నిరూపిస్తున్నారు.
సోషల్ మీడియా( Social Media ) బాగా ప్రాచుర్యం పొందడంతో ఇలాంటి తెలివైన వారు బయటకు వస్తున్నారు.అవును, పల్లె నుండి పట్నం వరకు దేశంలోని ప్రతి మూల ప్రతిభావంతులైన వ్యక్తులు ఎందరో ఉంటారు.
దానికి తార్కాణంగా నిలుస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.
అవును, సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేము.కొన్నిసార్లు కొందరు కారును హెలికాప్టర్‌గా మార్చేస్తే.మరికొందరు కుండలతో ఏకంగా ఎయిర్ కూలర్‌ను తయారు చేసేస్తున్నారు.
తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.కాగా అది చూసిన నెటిజన్లు అయితే చాలా ఆశ్చర్యపోతున్నారు.
రైతులకు( Farmers ) ఎంతగానో ఉపయోగపడిన పొలంలో మొక్కలు నాటే( Planting Machine ) ఓ ప్రత్యేక యంత్రాన్ని తయారు.ఈ యంత్రంతో 10 మంది చేసే పని ఇప్పుడు ఇద్దరు రైతులు చాలా స్పీడుగా, ఎంతో సౌకర్యంగా చేసుకోవచ్చు.
వైరల్ వీడియోని ఒక్కసారి గమనిస్తే పొలంలో ఓ రైతు మొక్కలు నాటుతున్న దృశ్యం చూడవచ్చు.సాధారణంగా ఒక పొలంలో విత్తనాలు నాటడానికి నలుగురైదుగురు కూలీల అవసరం అయితే ఖచ్చితంగా కావలసి ఉంటుంది.అయితే ఓ రైతు తయారు చేసిన ఈ యంత్రంతో పని చాలా సులువుగానే కాకుండా అతి తక్కువసమయంలోనే పూర్తి చేయొచ్చు.పార, పలుగు లేకుండానే ఆ యంత్రం సాయంతో గోతులు తవ్వి మొక్కలు నాటేస్తున్నాడు.
ఇందుకోసం భూమిని సక్రమంగా దున్నుకుంటే చాలు.దీనిని చూసిన నెటిజన్లు ఈ ఒక్క యంత్రం ఉంటే చాలు, రైతులకు సమయం, డబ్బు రెండు ఆదా అవుతాయని చెబుతున్నారు.