జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే ఆ పార్టీలో పెద్దగా మార్పులు ఏవీ చోటు చేసుకోకపోయినా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనాల్లో నమ్మకం పెంచుకోలేక పోయాడు.అదే సమయంలో ప్రజల్లో నమ్మకాన్ని మరింతగా కోల్పోయాడు.
ఇక ఎన్నికల్లోనూ పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి చెందడమే కాకుండా కేవలం రాజోలు నియోజకవర్గం నుంచి ఒక సీటు సంపాదించగలిగాడు.పోనీ ఆ ఒక్క ఎమ్యెల్యే అయినా పవన్ చెప్పు చేతల్లో ఉన్నాడా అంటే అదీలేదు.
తరచుగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను పొగడడమే పనిగా పెట్టుకున్నాడు.ఇక పార్టీ విషయానికి వస్తే పవన్ తప్ప పేరున్న, నోరున్న నాయకులు ఎవరూ కనిపించడంలేదు.
ఇక పవన్ ప్రజా పోరాటాలు చేస్తున్నా పార్టీలోనూ, ప్రజల్లోనూ పెద్దగా నమ్మకం పెంచుకోలేకపోతున్నాడు.
కాలానికి అనుగుణంగా పార్టీని, నాయకులను తయారు చేసుకోకపోతే పరిస్థితు ఎలా ఉంటుందో పవన్ తెలుసుకోలేకపోతున్నాడు.
ఈ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీలను పవన్ ఫాలో అయిపోతున్నట్టు కనిపిస్తోంది.జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో పవన్ ఘోరంగా విఫలమవుతున్నాడు.
ఆయన పార్టీ నడుపుతున్న తీరు, ఆయన చేస్తున్న రాజకీయం అనేక అనుమానాలకు తావిస్తోంది.గత ఆరు నెలల కాలంలో పవన్ కల్యాణ్ అనేక వ్యూహాత్మక అంశాలను భుజాన వేసుకుని ముందుకు వెళ్లారు.
వీటిలో ప్రదానంగా కొన్నిటిని పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా,ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం తదితర అంశాలపై పోరాటం చేసాడు.అలాగే రాయలసీమ కరువు, ఇప్పుడు రైతులు, అయితే, ఈ విషయాల్లో దేనిపైనా పవన్ నిబద్దతతో కూడిన రాజకీయాలు చేయడం లేదనే విమర్శలు మూటగట్టుకున్నారు పవన్.

ఆయన ఏ విషయాన్ని భుజాన వేసుకున్నా మధ్యలోనే వదిలేస్తారు అన్న బడును నిజం చేస్తూనే ఉన్నారు.కేవలం వైసిపీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టడం వరకే జనసేన పరిమితం అవుతుంది తప్ప తమ పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు వేయలేకపోతున్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే సమస్యలు ఉన్నా పవన్ మౌనంగా ఉండిపోయారు.కానీ అన్ని సమస్యలు వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడినట్టుగా పవన్ పోరాటం చేయడం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
రైతులకు కనీస మద్దతు ధర అనేది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం.ఇక, రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వడం లేదని పవన్ కల్యాణ్ అంటు న్నారు.
ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు కొన్నిరోజులు ఆలస్యమైనా కూడా ఎట్టి పరిస్థితిల్లోనూ రైతుల ఖాతాల్లోకి చేరిపోతాయనే విషయాన్ని పవన్ పరిగణలోకి తీసుకోలేదు.సమాజంలో మార్పు కోసమే జనసేన ఆవిర్భవించింది అన్న పవన్ పార్టీలో మాత్రం ఆ మార్పు తీసుకురాకపోగా తనకు కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతం కాదు అన్నట్టుగా వ్యవహారాలు చేస్తున్నాడు.
ఇంకా చెప్పాలంటే వామపక్ష పార్టీల వలే పార్టీలు ఉన్న ప్రజల్లో బలం లేనట్టుగా పవన్ జనసేనను నడిపిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి.
.