టీడీపీలో రీ ఎంట్రీపై ఎన్టీఆర్ ఆలోచన ఇదేనా ?

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముందు ముందు ఆ పార్టీ మనుగడ కష్టంగానే ఉండేలా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడివల్లే అది సాధ్యమవుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

చంద్రబాబు రాజకీయ వారసుడిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఉన్నా ఆయన నాయకత్వంపై పార్టీలో ఎవరికీ నమ్మకంలేదు.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ప్రస్తావన టీడీపీలో ఎక్కువగా వస్తోంది.

అయితే దీనిపై ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా ఎక్కడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించడంలేదు.అసలు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించడంలేదు.

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే లోకేష్ రాజకీయ భవితవ్యం గందరగోళంలో పడుతుంది అనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.

Advertisement

ఎన్టీఆర్ రాకను అడ్డుకునేందుకు టీడీపీ లో ఉన్న కొంతమంది నాయకులతో బాబు ప్రకటనలు చేయిస్తున్నాడు.కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత వార్ల రామయ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ అసలు టీడీపీకి ఎన్టీఆర్ అవసరమే లేదు అంటూ ప్రకటించారు.అయితే టీడీపీ లో మరో వర్గం మాత్రం లోకేష్ కి అంత సామర్ధ్యం లేదని ఆయన్ను పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అంటూ చెబుతున్నారు.

ఇలా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదే పదే వస్తున్న నేపథ్యంలో తన సన్నిహితులు కొంతమంది దగ్గర తన మనసులో మాట చెప్పుకున్నట్టు తెలుస్తోంది.తనకు రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేదని, తనకు అక్కడికి వెళ్ళినా పెద్ద ప్రాధాన్యత ఉండదని, కొంతమంది నాయకులూ నన్ను కోరుకుంటున్నారు తప్ప కార్యకర్తలు ఎవరూ నన్ను కోరుకోవడం లేదు అంటూ చెప్పారట.

ఇక తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ప్రస్తుత టీడీపీ చీఫ్ చంద్రబాబు అస్సలు ఇష్టం లేదు అని, అసలు తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలంటే అధిష్టానం నుంచి తనకు ఆహ్వానం ఉండాలి కదా అని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.వాస్తవంగా తనకు కూడా రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇష్టంలేదని చెప్పినట్టు తెలుస్తోంది.అసలు నాకు టీడీపీలోకి వెళ్లే ఉద్దేశం ఉంటే ఇటీవల తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తన అక్క సుహాసిని పోటీ చేసినా తాను ఎన్నికల ప్రచారానికి అందుకే వెళ్లలేదని, నాన్నతోనే అన్నీ అయిపోయాయని మళ్లీ జెండా పట్టుకోలేను అంటూ ఎన్టీఆర్ తన సన్నిహితులు కొంతమంది దగ్గర వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విషయంపైనే పార్టీ వర్గాల్లో ఎక్కువగానే చర్చ జరుగుతోంది.ఇక మరికొంతమంది పార్టీ సీనియర్ లు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి టీడీపీలో యాక్టివ్ చేయాలని బాబు కు చెబుతున్న ఆయన ఈ టాపిక్ తీసుకువస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు