గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) సంచలన వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ ని( Jr NTR ) అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు( Chandrababu ) నమ్మకద్రోహం చేసి పార్టీని లాక్కున్నాడు.ఎన్టీఆర్ వారసులు, అభిమానులు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరు అని అన్నారు.
ఎన్టీఆర్ అభిమానులపై దాడులు జరుగుతున్నప్పుడు లోకేష్.చంద్రబాబు ఖండించలేదు.
ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టినప్పుడే… అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి.వైయస్సార్, ఎన్టీఆర్ ఇద్దరూ తనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళని ఎన్టీఆర్ ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అభిమానులు అందరూ కష్టపడి టీడీపీని ( TDP ) గెలిపిస్తే ఎన్టీఆర్ కెరియర్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
ఎవరైతే పెద్ద ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారో.పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళ దగ్గరికి వస్తారన్నారు.తాను పెద్ద ఎన్టీఆర్ భక్తుడునని నందమూరి హరికృష్ణ తన గురువు అని.వైసీపీలో( YCP ) ఉన్న రాజకీయంగా తనకు జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతానన్నారు.ఎన్టీఆర్ కుటుంబంతో తనకున్న బంధవ్యం విడదీయరానిదాని వారికోసం నేను… నాకోసం వారు అనేక త్యాగాలు చేశారన్నారు.
తెలుగుదేశం పార్టీ గౌడ, యాదవ, మత్స్యకార.ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించిందని.
సీట్లు కూడా కేటాయించలేదని పేర్కొన్నారు.ఇదే సమయంలో సీఎం జగన్.
బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వటమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించినట్లు కొడాలి నాని వ్యాఖ్యానించారు.