సీతా రామం సినిమాతో( Sita Ramam Movie ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది మృణాళ్ ఠాకూర్.( Mrunal Thakur ) ఆమె చేసే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది.
చాలామందికి ఆమె సీతగా హృదయాల్లో నిలిచిపోయింది.హాయి నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఎందుకో ఆమెను అందరూ సీతా రామం సినిమాలోని సీత పాత్రలోనే ఊహించుకుంటూ ఉంటారు.
ఇదే కొంతవరకు ఆమె కు ప్లస్ అయినప్పటికీ మైనస్ గా కూడా ఇదే విషయం ఉంటుంది.ఆ పాత్ర దాటి ఆమెను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడానికి జనాలు ఒప్పుకోవడం లేదు.
సరే కాసేపు సీతారామం సినిమా సంగతులు పక్కన పెడితే ఏమనాలి జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని ఆమె ఇటీవలే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.
అనేక భాషల్లో నటిస్తున్న దుల్కర్ సల్మాన్ కి( Dulquer Salman ) తనకు మధ్య మంచి స్నేహం ఉందని సీతా రామం సినిమా టైంలో తనతో మొట్టమొదటిసారిగా నటించాలని అతడే తన మొదటి కో స్టార్ అని అలాగే మెంటర్ గా కూడా దుల్కర్ కి ఎనలేని ప్రాధాన్యత ఉంది అని చెబుతోంది మ్రుణాల్ ఠాకూర్.తనకు ఎలాంటి సమస్య వచ్చినా మొదటగా నేను దుల్కర్ కి మాత్రమే ఫోన్ చేస్తానని, అతడే నాకు ఇన్స్పిరేషనల్ పర్సన్ గా కూడా ఉన్నాడని చెబుతోంది.పైగా ఇప్పటివరకు తను నటించిన అందరూ హీరోలలో దుల్కర్ సల్మాన్ బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెబుతోంది.
మరోమారు అతనితో నటించే అవకాశం వస్తే కథ కూడా వినకుండా ఓకే చేస్తానని చెబుతోంది మృణాల్.
దుల్కర్ లాంటి నటుడుతో మొట్టమొదటి సినిమాలో నటించడం తన అదృష్టం అని తనకు ఎన్నో విషయాల్లో హెల్ప్ చేసేవాడని నటన విషయంలో, సీన్స్ కి సంబంధించిన అనేక విషయాల్లో దుల్కర్ సహాయం బాగా ఉండేదని నేను ఎప్పటికీ సీత గానే ఉంటానని నా రాముడు దుల్కర్ అంటూ చెబుతోంది.ఇలా తనకు దుల్కర్ పై ఉన్న అభిమానాన్ని మీడియా ముందు బయటపెట్టింది.ఇక ఫ్యామిలీ స్టార్ మూవీ( Family Star ) తర్వాత విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) మృణాల్ బాగా క్లోజ్ అయ్యింది అనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.