సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు, వివాదాలు చాలా కామన్.సినిమా విషయంలో కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల దర్శకులకు హీరోలకు మధ్య ఎన్నో తగాదాలు వస్తూ ఉంటాయి.
కానీ అవి టీ కప్పులో తుఫాను లాగానే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి.మళ్లీ మరో సినిమా కోసం కలిసే పని చేస్తారు.
ఇలా చాలామంది హీరోలకు దర్శకులకు జరుగుతూనే ఉంటుంది.అయితే ఎన్టీఆర్,( NTR ) విశ్వనాధ్( Vishwanath ) మధ్యలో వచ్చిన ఒక అగాధం గురించి చాలామందికి తెలియదు.
వీరిద్దరూ మంచి స్నేహితులు తొలినాల్లలో కానీ చిన్న విషయం కారణంగా తగదా వచ్చి విడిపోయి మళ్లీ జీవితంలో ఎప్పుడూ కలిసి పని చేయలేదు.ఎన్టీఆర్ సాధారణంగా తనకు ఎవరైనా అడ్డు చెబితే లేదా నచ్చని పని చెబితే నచ్చని విషయం మాట్లాడితే వారిని దూరం పెడతారు.
అలాంటి ఒక చిన్న కారణమే వీరిద్దరి మధ్య కూడా జరిగి వారికి ఎడబాటు వచ్చింది.
వాస్తవానికి విశ్వనాధ్, ఎన్టీఆర్ ఇద్దరు ఒకే కాలేజీలో గుంటూరులో చదువుకున్నారు.ఎన్టీఆర్ విశ్వనాధకన్నా ఒక సంవత్సరం సీనియర్.విశ్వనాథ్ కాలేజీలో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కి ఉద్యోగం వచ్చింది.
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఇద్దరూ వచ్చారు.వీరిద్దరి మధ్య ముందు నుంచి ఉన్న పరిచయంతో సినిమాలు కూడా కలిసి తీశారు.
అలా నాలుగు సినిమాలకు కలిసి పని చేశారు ఎన్టీఆర్ మరియు విశ్వనాథ్. అయితే ఒకరోజు ఎన్టీఆర్ హీరోగా విశ్వనాధ్ దర్శకుడుగా పనిచేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుందట.
ఎంతో ఎమోషనల్ గా సాగుతున్న ఆ సీన్ లో ఎన్టీఆర్ కళ్ళకు చలవ కళ్లద్దాలు పెట్టుకుని నటిస్తున్నారట.ఒక ఎమోషనల్ సీన్ లో( Emotional Scene ) గ్లాసెస్ పెట్టుకొని నటించడం బాగోదు అని విశ్వనాథ్ వద్దు అన్నారట.
కానీ ఎన్టీఆర్ కి అది నచ్చలేదు.నాకు ఇలాగే బాగుంది నేను ఇలాగే నటిస్తాను అంటూ చెప్పారట.విశ్వనాథ్ కి అలా చెప్పడంతో నచ్చలేదు ఇద్దరి మధ్య గొడవ జరిగిందట.ప్రొడ్యూసర్ జోక్యం చేసుకొని విశ్వనాథ్ నీ ఒప్పించి సీన్ చేయించారట.అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్ కళ్ళ అద్దాలతోనే నటించారట.ఆ తర్వాత మరో సినిమాకి కథ చర్చలు జరిగాయట కానీ ఆ సినిమాకి దర్శకుడిగా విశ్వనాధ్ వద్దు అని యోగానంద్ తో( Yoganand ) చేయించారట ఎన్టీఆర్.
అలా వారి మధ్య విభేదాలు వచ్చి దాదాపు 20 ఏళ్లకు పైగా మాట్లాడుకోలేదట.