రాజమౌళి( Rajamouli ) మహేష్ బాబు( Mahesh Babu ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.అయితే ఇప్పటికే రాజమౌళి తీసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఆయన ట్రాక్ రికార్డు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.
ఇదే ఉద్దేశ్యంతో పాన్ ఇండియాలో( Pan India ) ఇప్పటికే 3 అదిరిపోయే సక్సెస్ లను అందుకున్న రాజమౌళి ఈ సినిమాతో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక సిక్స్ ప్యాక్ బాడీ తో పొడుగాటి జుట్టుతో కనిపించే మహేష్ బాబు హాలీవుడ్ హీరో లాగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక స్క్రీన్ మీద మహేష్ బాబు చూసిన ప్రతి ఒక్కరు హాలీవుడ్ హీరో కి( Hollywood Hero ) ఏ మాత్రం తీసుపోని రేంజ్ లో ముందుకు దూసుకెళ్లిపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాలని రాజమౌళి సినిమా మీద చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే స్టార్ స్టేటస్ ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో కూడా చాలా కసరత్తులు చేస్తున్నాడు.ఇక ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) కూడా భారీ కథ ను సిద్ధం చేశాడు.ఇక ఈ సినిమాని చూసిన హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద ప్రశంస జల్లు కురిపించేలా ఈ సినిమాని తెరకెక్కించడమే లక్ష్యంగా పెట్టుకొని రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది… ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…
.