ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి పోకడ పూర్తిగా మారిపోయింది.హీరోయిన్స్ కి ఆఫర్స్ రావడమే చాలా గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి.
ఒక సినిమా మొదలవుతుంది అంటే హీరోయిన్ రోల్ కి బోలెడన్ని ఆప్షన్స్ దొరుకుతున్నాయి.అందుకే చాలామంది హీరోయిన్స్ త్వరగానే తెరమరుగు అయిపోతూ ఉంటారు.
పైగా హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ సినిమాల లైఫ్ టైం చాలా తక్కువ.అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా చాలా మంది హీరోయిన్స్ వచ్చిన ప్రతి సినిమాను ఒప్పేసుకుంటూ కాసుల వర్షం కురిపించుకునే ప్రయత్నంలో ఉంటారు.
అయితే ఇప్పుడు మనం చెప్పుకో హీరోయిన్స్ ఖాళీగా అయినా ఉంటారు కానీ ఏ సినిమా పడితే ఆ సినిమా చేసే టైపు కాదు.మరి ఆ హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాలు చేస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
సాయి పల్లవి
చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాయి పల్లవి( Sai Pallavi ) స్టోరీ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది అని అందరికి తెలుసు.ఆమె పాత్రకి ప్రాధాన్యత లేకపోతే అస్సలు ఎంత పారితోషకం ఇచ్చిన ఆ సినిమా చేయదు.
ప్రియాంక అరుళ్ మోహన్
జెంటిల్మెన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ అమ్మడు.అయితే ఇన్నేళ్లలో ఈమె చేసిన సినిమాలు చాలా తక్కువ.స్క్రిప్ట్ విషయంలో ఆమె చాలా కేర్ ఫుల్ గా ఉంటారట.ఏ సినిమా పెడితే ఆ సినిమా చేసే అవసరం తనకు లేదు అంటుంది.ప్రస్తుతం మళ్ళీ నానితోనే జతకట్టిన ప్రియాంక( Priyanka Arul Mohan ) అధికారులను ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్రద్ధ శ్రీనాథ్
నాని నటించిన జెర్సీ మూవీ తో తెలుగు ప్రేక్షకుల చేత శ్రద్ధ శ్రీనాథ్( Shraddha Srinath ) బాగానే గుర్తింపు పొందింది.ఆ తర్వాత ఎంతమంది మేకర్స్ ఆమెకు కథలు చెప్పిన ఆ స్టోరీలో ప్రాధాన్యత తనకు లేదని ఉద్దేశంతో చేయడానికి ఇష్టపడలేదట.అందుకే ప్రస్తుతం శ్రద్ధ సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పని చేయడం లేదు.
శ్రియ రెడ్డి
సలార్ సినిమాతో ఓ శ్రీయ రెడ్డి( Shriya Reddy ) పేరు మరో మారు టాలీవుడ్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది.గతంలో ఈమె హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించింది.అయితే ఆమె ఎన్ని వందల కథలు విన్నా కూడా చాలా తక్కువ సినిమాలోని నటించింది.అందుకు గల కారణం ఆమెకు కథలు నచ్చకపోవడమే.
నజ్రియా
తమిళ ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న నజ్రియా( Nazriya ) తెలుగులో రాజా రాణి సినిమాతో పాపులర్ అయింది అయితే యువర్ అంటే సుందరానికి సినిమాలో నటించింది చాలా ఎక్కువ కథలు విన్నా కూడా ఆమె ఒకటి రెండు సినిమాలు తప్ప అసలు చేయడం లేదు.కథ ఎంతో అద్భుతంగా ఉంటే గాని నజ్రియా సినిమా చేయడానికి ఒప్పుకోవడం లేదు.