సాధారణంగా వూళ్ళల్లో పండగలు, పబ్బాలప్పుడు సరదాగా కోళ్ళ పందాలను ఆడిస్తూ వుంటారు.కొన్ని చోట్లైతే లక్షల్లో పందలను కూడా కాస్తూ వుంటారు.
ఇంకా చాలామంది కోళ్ళ పందాలను చాలా సరదాగా వీక్షిస్తూ వుంటారు.అదే రెండు మేకల మధ్య పోటీ అయితే ఎలాగుంటుంది? ఇంకా మజాగా వీక్షిస్తుంటారు జనాలు.తాజాగా అలాంటి ఫైటింగ్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్ కావడం మనం చూడవచ్చు.అయితే వాటి మధ్య యుద్ధం ఏదో కొద్ది సేపు జరిగింది అనుకుంటే పొరపాటే.
సుమారు రెండు గంటల పాటు నువ్వా, నేనా అనే రేంజ్ లో అవి మల్ల యుద్ధం చేశాయి.

ఖమ్మం జిల్లా( Khammam District ) పెనుబల్లి, కల్లూరు మండలాల సరిహద్దులో ఈ ఫైటింగ్ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.సరిగ్గా రెండు మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎర్ర బంజర, కర్రాలపాడు గ్రామాల సరిహద్దు లో నడి రోడ్డు పై అవి ఫైటింగ్ కు దిగాయి.మనుషుల కంటే మేమే ఫైటింగ్ బాగా చేస్తామని రోడ్డు మీద పోయే వారికి ఫైటింగ్ చేస్తూ… కెమెరాకు చిక్కాయి ఆ మేకలు.
సుమారు రెండు గంటల పాటు ఆ రెండు మేకలు ఫైటింగ్ చేయడాన్ని చూసి గ్రామస్థులు వీస్తుపోయారంటే మీరు నమ్మితీరాల్సిందే.

అది చూసిన నెటిజన్లు బాహుబలి లో( Baahubali ) కథానాయకులు ప్రభాస్, రానా ల మధ్య ఫైటింగ్ సీన్ ల తలబడుతున్నాయని నవ్వుకుంటున్నారు.ఇక ఈ విషయంపైన మేకల కాపరి రాజ మాత్రం ఇవి ప్రతి రోజూ ఇలానే ఫైటింగ్ చేస్తాయి.వాటికి అది మామూలే.
కానీ గూటికి చేరుకున్నాక మళ్ళీ కలిసి పోతాయి అని నవ్వుతూ చెప్పుకు రావడం కొసమెరుపు.కాగా అటువైపుగా వెలుతున్న వాహనదారులు గెట్టు తగాదాల సరిహద్దులో బలే ఫైటింగ్ చేస్తున్నాయే.
అనుకుంటూ అక్కడికి వెళ్తున్నారు.అవును, వారంతా నువ్వా నేనా అన్నట్లు సాగిన మేకల ఫైటింగ్ ఆసక్తిగా తిలకించారు.