Superstar Krishna Father : తండ్రి కోరికను నెరవేర్చలేకపోయానని కృష్ణ బాధపడ్డారా.. ఏమైందంటే?

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా విభిన్నమైన కథలలో నటించి ఆ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్నారు.అనుకున్నది సాధించడం కోసం కృష్ణ ఎంతగానో కష్టపడేవారు.

 Shocking Secrets About Super Star Krishna Cine Career Details Here Goes Viral-TeluguStop.com

విభిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ఆ కథలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రేక్షకులకు కృష్ణ దగ్గరయ్యారు.అయితే కృష్ణ తండ్రి అతనిని ఇంజనీర్ చేయాలని అనుకున్నారు.

అయితే కృష్ణ మాత్రం ఆయన కోరికను నెరవేర్చలేకపోయారు.

సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయిన తర్వాత తండ్రి కోరికను నెరవేర్చలేకపోయానని కృష్ణ చాలా బాధ పడ్డారని సమాచారం.

తేనె మనసులు సినిమాతో కృష్ణ హీరోగా పరిచయమైనా ఆ సినిమాకు ముందే కృష్ణ పలు సినిమాలలో హీరోగా నటించడం గమనార్హం.కులగోత్రాలు సినిమాతో నటుడిగా కృష్ణ ప్రయాణం మొదలుకాగా ఆ తర్వాత పలు చిన్న సినిమాలలో కృష్ణ నటించారు.

సినీ చరిత్రలో ఎన్నో అరుదైన ఘనతలను కృష్ణ సొంతం చేసుకున్నారు.

రాజీవ్ గాంధీ హత్య అనంతరం వేర్వేరు కారణాల వల్ల కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు.

కృష్ణ మంచితనానికి రాజకీయాలకు సూట్ కాలేదు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికి కృష్ణ ఇష్టపడేవారు.కృష్ణ వందో సినిమా అల్లూరి సీతారామరాజు కాగా సినిమా స్కోప్ లో ఈ సినిమా తెరకెక్కింది.30 కాల్షీట్ల పాటు కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా కోసం పని చేయగా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Cine Career, Krishna, Kulagotralu, Secrets, Tena Manasulu, Tollywood-Movi

రిపీట్ రన్ లో కూడా 100 రోజులు ఆడిన అతికొద్ది సినిమాలలో ఈ సినిమా ఒకటి కాగా ఈ సినిమా ప్రభావం కృష్ణ కెరీర్ పై చాలాకాలం ఉంది.కృష్ణ చేసిన సేవా కార్యక్రమాలు ఆయన గొప్పదనం గురించి ఎన్ట చెప్పినా తక్కువే అవుతుంది.టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన అతికొద్ది మంది సినీ ప్రముఖులలో కృష్ణ ఒకరు కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube