క్రాక్‌లో అదిరిపోయే ట్విస్టు.. విలన్ అనుకుంటే అంతే!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘క్రాక్’ ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో రవితేజ మరోసారి అదిరిపోయే సక్సెస్ కొడతాడని అందరూ అశిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అని అందరూ ఆనుకున్నారు.అయితే ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, ఈ సినిమా కథ ఏమిటో మనకు క్లూ ఇచ్చారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.అయితే ఆమె ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తుందని అందరూ అనుకుంటున్నారు.

కానీ ఈ సినిమాలో ఆమె లేడీ విలన్ పాత్రలో కాకుండా హీరోయిన్‌గా నటిస్తోందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ రవితేజతో రొమాన్స్ కూడా చేయనుందని తెలుస్తోంది.

Advertisement

హీరోయిన్ శృతి హాసన్ తరువాత అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనుందట.ఇక ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, లాక్‌డౌన్ కారణంగా అది వాయిదా పడింది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు