ఒక సినిమాలో ఎక్కువ పాత్రలు పోషించడం అంటే మన టాలీవుడ్ హీరోలకు మక్కువ ఎక్కువ.అది చాలా సాహసంతో కూడుకున్న పని అయినా కూడా ఎంతో ఇష్టంతో చేస్తూ ఉంటారు.
గతంలో అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) ఏకంగా నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రలు పోషించారు.ఇలా ఎన్ని పాత్రలు పోషించి అక్కినేని అప్పట్లో రికార్డు సాధించారు ఇదే సినిమాను శివాజీ గణేషన్ రీమేక్ చేశారు.
అక్కడ కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది ఆ తర్వాత కమల్ హాసన్ దశావతారం సినిమాలో పది పాత్రలు పోషించి అక్కినేని, శివాజీ గణేషన్ పేరు మీద ఉన్న రికార్డును అధిగమించారు.ఆ తర్వాత ఎన్టీఆర్( NTR ) 1977 లో దానవీరశూరకర్ణ( Daana Veera Soora Karna ) సినిమాలో మూడు పాత్రల పోషించి సంచలనం సృష్టించారు.
ఆ చిత్రంలో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రల్లో నటించి మూడు పాత్రలు పోషించిన రికార్డు సాధించాడు ఎన్టీఆర్.ఈ సినిమాకు ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వహించారు.ఎన్టీఆర్ ఆ తర్వాత విరాటపర్వం లో ఏకంగా ఐదు పాత్రలు పోషించాడు.కీచకుడు, అర్జునుడు, బృహన్నల, కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రలు పోషించాడు.
ఇక కృష్ణ( Krishna ) కూడా కుమార రాజా చిత్రంలో( Kumara Raja Movie ) తండ్రి పాత్రతో పాటు ఇద్దరు కొడుకుల పాత్రలు పోషించాడు.కృష్ణ ఈ ట్రిపుల్ యాక్టర్ గా ఏకంగా ఏడు సార్లు నటించి రికార్డు సాధించాడు.శోభన్ బాబు సైతం ముగ్గురు మొనగాళ్లు( Mugguru Monagallu ) సినిమాలో మూడు పాత్రలో నటించాడు.
అది నాయకుడు సినిమాలో బాలకృష్ణ సైతం మూడు పాత్రలు నటించగా, జై లవకుశ( Jai Lavakusa ) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సైతం మూడు పాత్రల్లో నటించి ఈ రికార్డు సాధించాడు.ఇలా ఈ ఆరుగురు హీరోలు మూడు పాత్రల్లో నటించి రికార్డులు సాధించారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మూడు పాత్రలో నటించడానికి ఏ హీరోలు పెద్దగా ఉత్సాహం చూపించకపోవడం విశేషం.
మిగతా హీరోలు అంతా ఒక్కసారి మాత్రమే మూడు పాత్రలో నటించగా కృష్ణ మాత్రమే ఏడుసార్లు నటించడం విశేషం.