తలలో చుండ్రున్నా, పేలున్నా.ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.ఈ సమస్యలను నివారించుకునేందుకు ఆయిల్స్ మారుస్తుంటారు.షాంపూలు మారుస్తుంటారు.అయినప్పటికీ ఫలితం లేకుంటే తెగ బాధ పడుతుంటారు.
అయితే తలలో చుండ్రు మరియు పేలను నివారించడంలో తులసి ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.మరి తులసి ఆకులను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని తులసి ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మరసం మరియు వేపాకుల రసం వేసి బాగా కలిపి.
తలకు, కేశాలకు పట్టించాలి.గంట పాటు ఆరనిచ్చి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే పేలు, చుండ్రు వంటి సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.
అలాగే కొన్ని తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ తులసి ఆకుల పొడిలో ఉసిరి కాయ పొడి మరియు బాదం నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమంతో హెయిర్ ప్యాక్ వేసుకుని.ముప్పై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.జుట్టు రాలడం కూడా తగ్గు ముఖం పడుతుంది.
ఇక తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకుని రసం తీసుకోవాలి.ఈ రసంలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి.
రాత్రి నిద్రించే ముందు తలకు బాగా పట్టించాలి.ఉదయం లేవగానే తలస్నానం చేయాలి.
ఇలా వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తే.చుండ్రు, పేలు దూరం అవుతాయి.
మరియు జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది.