ప్రముఖ యాంకర్, బీజేపీ నేత శ్వేతారెడ్డికి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.నిహారిక పోలీసులు అరెస్ట్ చేశారని న్యూస్ వైరల్ కావడంతో దాని గురించి మాట్లాడాలని తాను అనుకున్నానని ఆమె వెల్లడించారు.
చిరంజీవి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారో చూడాలంటూ శ్వేతారెడ్డి ఒక వీడియోను చూపించారు.చిరంజీవి ఈ వీడియోను నిహారికకు చూపించడం మరిచిపోయాడేమోనని ఆమె అన్నారు.
వీడియోలో చిరంజీవి అద్భుతమైన స్క్రిప్ట్ తో అద్భుతమైన డైలాగ్స్ ను చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.అయితే ఇలాంటి వీడియోలను మొదట ఇంట్లో పిల్లలకు చూపించాలని ఆమె తెలిపారు.
ఇంట్లో పబ్బులు, క్లబ్బులు, లేట్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలకు పోకుండా ఉండాలని అమ్మాయిలకు చూపించాలని లక్ష్యమే ఊపిరిగా బ్రతకాలని ఆడపిల్లలకు చెప్పాలని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చారు.ఆ తర్వాత ఈ వీడియోలను ప్రపంచానికి విడుదల చేయాలని శ్వేతారెడ్డి కామెంట్లు చేశారు.
నిహారిక తాజాగా కేసులో అరెస్ట్ అయిందని ప్రచారం జరిగిందని నాగబాబు అమూల్ బేబీ అని ఎంకరేజ్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు.కొంతమంది సినిమా ఫ్యామిలీల పిల్లలు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రావడం కామన్ అని చెప్పి ఆయన చెబుతున్నాడేమో తనకు అర్థం కావడం లేదని శ్వేతారెడ్డి వెల్లడించారు.శ్వేతారెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాను టీవీలో కూడా నిహారికకు సంబంధించిన వార్తలు చూశానని ఆమె చెప్పుకొచ్చారు.నాలాంటి ఆడవాళ్లపై కామెంట్లు చేసే జనసైనికులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నారో చూస్తుంటే జాలేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.మనం నీతులు చెప్పడం కాదని మన ఇంట్లో ఆడబిడ్డల గురించి మనం ఆలోచించుకోవాలని శ్వేతారెడ్డి పేర్కొన్నారు.