నిద్రలేమి( Insomnia ).ఇటీవల రోజుల్లో ఎంతో మందిని కలవర పెడుతున్న సమస్య ఇది.
ఎంత ప్రయత్నించినా కూడా కంటికి కునుకు రాకపోవడాన్నే నిద్రలేమి అంటారు.నిద్రలేమి కారణంగా ఒత్తిడి పెరుగుతుంది.
నీరసం, అలసట ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.ఇలా ఒకటా రెండా అనేక రోగాలు చుట్టుముడతాయి.
అందుకే నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నించాలి.ఇకపోతే నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే టీ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.
![Telugu Banana, Bananatea, Tips, Insomnia, Latest, Problem-Telugu Health Telugu Banana, Bananatea, Tips, Insomnia, Latest, Problem-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/11/Banana-tea-helps-to-get-rid-of-insomniac.jpg)
రోజూ నైట్ ఈ టీను తాగితే ప్రశాంతమైన నిద్రను పొందుతారు.ఇంతకీ ఆ టీ ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా దోరగా పండిన ఒక అరటి పండును( Banana fruit ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత అరటి పండుకు రెండు వైపులా ఉన్న కొనలు తొలగించి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అందులో అరటిపండు స్లైసెస్ మరియు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
దాంతో మన టీ అనేది సిద్ధమవుతుంది.
![Telugu Banana, Bananatea, Tips, Insomnia, Latest, Problem-Telugu Health Telugu Banana, Bananatea, Tips, Insomnia, Latest, Problem-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2024/11/Banana-tea-helps-to-get-rid-of-insomniad.jpg)
స్టైనర్ సహాయంతో టీను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ బనానా టీ హెల్త్ పరంగా చాలా మేలు చేస్తుంది.ముఖ్యంగా ఈ టీ లో పొటాషియం, మెగ్నీషియం మరియు ట్రిప్టోఫాన్‌తో సహా నిద్రను ప్రోత్సహించే పోషకాలు ఉన్నాయి.
ట్రిప్టోఫాన్ స్లీప్ హార్మోన్లను ప్రోత్సహిస్తుంది.మెగ్నీషియం నిద్ర నాణ్యతను పెంచుతుంది.
పొటాషియం రాత్రిపూట కండరాల తిమ్మిరిని తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడుతుంది.మొత్తంగా బనానా టీ నిద్రలేమి సమస్యకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.
ప్రతిరోజు నైట్ భోజనం తర్వాత ఈ బనానా టీ తాగితే ప్రశాంతంగా నిద్రపోతారు.అంతేకాకుండా బనానా టీలో మెగ్నీషియం మరియు మాంగనీస్ ఉంటాయి.
ఇవి మీ ఎముకలను బలోపేతం చేయడానికి మరియు బోలు ఎముకల వ్యాధిని నిరోధించడానికి తోడ్పడతాయి.