తల్లి ఎప్పుడూ పిల్లలకు మంచి జరగాలని కోరుకుంటుంది.పిల్లలు సక్సెస్ సాధిస్తే తల్లి సంతోషించిన స్థాయిలో ఎవరూ సంతోషించరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ప్రీతిక మెహతా( Preetika Mehta ) సక్సెస్ స్టోరీ నేటి తరంలో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోంది. బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ సాధిస్తూనే మరోవైపు మోటివేషనల్ స్పీకర్ గా రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం( World Economic Forum ) ప్రీతికను గ్లోబల్ షార్పర్ గా గుర్తించడం గమనార్హం.చండీగఢ్ కు చెందిన ప్రీతిక బటర్ నట్ ఏఐ( Butternut AI )తో ఎంటర్ ప్రెన్యూర్ గా కూడా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.బాల్యం నుంచి ప్రీతికకు లెక్కలు అంటే ఇష్టం కాగా బొమ్మలను కూడా ఆమె ఎంతగానో ఇష్టపడేవారని తెలుస్తోంది.14 ఏళ్ల వయస్సులోనే ప్రీతిక కోడింగ్ మొదలుపెట్టగ ఒక స్టార్టప్ లో పని చేసే సమయంలో ఆమెకు కోడింగ్ పై ఆసక్తి పెరిగింది.

ఆ తర్వాత రోజుల్లో ప్రీతిక న్యూయార్క్ లోని స్టేట్ యూనివర్సిటీలో ఏఐలో మాస్టర్స్ చేశారు.బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ప్రీతికకు జాబ్ రాగా జాబ్ వచ్చిన కొన్నిరోజులకే ఆమె జాబ్ కు రాజీనామా చేసి పిల్లలకు కోడింగ్ నేర్పడానికి కిడ్డీ కోడర్స్ అనే స్టార్టప్ ను మొదలుపెట్టారు.మనపై మనకు నమ్మకం ఉంటే ఎన్ని విజయాలైనా సొంతమవుతాయని ప్రీతిక మెహతా చెబుతుండటం గమనార్హం.ప్రస్తుతం మోటివేషనల్ స్పీకర్ గా కూడా కెరీర్ ను కొనసాగిస్తున్న ప్రీతిక తన సక్సెస్ స్టోరీతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు స్పూర్తిగా నిలుస్తున్నారు.
అమెరికాలో వృత్తి జీవితంలో సైతం లింగవివక్షను ఎదుర్కొన్నానని ప్రీతిక చెబుతున్నారు.ప్రీతిక వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రీతికను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అమ్మ సక్సెస్ విషయంలో చేసిన సూచనల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని ఆమె పేర్కొన్నారు.







