దగ్గు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఇలా చేస్తే రెండు రోజుల్లో రిలీఫ్ పొందుతారు!

దగ్గు.అత్యంత సర్వసాధారణంగా విధించే సమస్యల్లో ఒకటి.

 Best Way To Get Rid Of Cough Within Two Days! Cough, Cough Relief Juice, Pineapp-TeluguStop.com

అందులోనూ కరోనా తర్వాత సీజన్ తో పని లేకుండా చాలా మంది దగ్గు సమస్యతో తీవ్రంగా మదన పెడుతున్నారు.పైగా ఇంట్లో ఒకరికి దగ్గు వచ్చిందంటే మిగిలిన వారందరికీ పట్టుకుంటుంది.

మీరు కూడా దగ్గుతో బాధపడుతున్నారా.? ఎన్ని మందులు వాడినా సమస్య పరిష్కారం కావడం లేదా.? అయితే వర్రీ వద్దు.ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తీసుకుంటే కేవలం రెండు రోజుల్లోనే దగ్గు నుంచి రిలీఫ్ పొందవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది ఓ చూపు చూసేయండి.

ముందుగా చిన్న పైనాపిల్( Pineapple ) ను తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను( Ginger ) వేసుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసి సేవించాలి.

ఈ పైనాపిల్ జింజర్ జ్యూస్ లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు కఫాన్ని కరిగించి దగ్గును చాలా సమర్థవంతంగా నివారిస్తాయి.జలుబు సమస్య ఉన్న సరే దూరమవుతుంది.

అలాగే ఈ పైనాపిల్ జింజర్ జ్యూస్ రోగ నిరోధక వ్యవస్థ( Immunity )ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.కాబట్టి ఎవరైతే దగ్గు సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ పైనాపిల్ జింజర్ జ్యూస్ ను రోజుకు ఒకసారి తీసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిలీఫ్ ని పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube