1000 కోట్ల వైపు అడుగులు వేస్తున్న 'పఠాన్'.. షారుఖ్ రికార్డ్ బ్రేక్!

బాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమా ‘పఠాన్’..

 Srk Comeback 'pathaan' Creates History, Pathaan, Shah Rukh Khan, Bollywood,1000c-TeluguStop.com

ఈ సినిమాతో బాద్షా ఇప్పుడు నిజంగానే బాలీవుడ్ బాద్షా అనిపించు కున్నాడు.ఎందుకంటే బాలీవుడ్ గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతం అవుతున్న నేపథ్యంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బాలీవుడ్ ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న క్రమంలో షారుఖ్ ఈ సినిమాతో ఊరట కలిగించాడు.

Telugu Crore, Bollywood, Siddharth Anand, Pathaan, Shah Rukh Khan-Movie

పఠాన్ సినిమా జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.

బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ సైతం రాబడుతుంది.రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఇంకా పఠాన్ కలెక్షన్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

ఈ సినిమా షారుఖ్ ఖాన్ తన కెరీర్ బ్రేకింగ్ కం బ్యాక్ గా నిలిచింది.అలాగే నార్త్ బెల్ట్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా దూసుకెళ్తుంది.

ఇక ఇటీవలే 800 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Telugu Crore, Bollywood, Siddharth Anand, Pathaan, Shah Rukh Khan-Movie

ఇక ఇప్పుడు 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతుంది.ఇందులో మేజర్ వసూళ్లు హిందీ వసూళ్లే ఉండడం విశేషం.ఇప్పటికీ లాంగ్ వీకెండ్ లలో పఠాన్ సినిమా అదర గొడుతుంది.

ఇక ఈ సినిమా ఈ వారాంతానికి ఆల్ మోస్ట్ 1000 కోట్ల దగ్గరికి వచ్చేయగా నెక్స్ట్ వీకెండ్ నాటికీ 1000 కోట్లను క్రాస్ చేస్తుంది అని బాలీవుడ్ లెక్కలు చెబుతున్నారు.దీంతో మన ఇండియన్ సినిమా దగ్గర కూడా మరొక 1000 కోట్ల సినిమాగా పఠాన్ నిలవబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube