2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ను స్వల్ప మెజారిటీతో ఓడించడంలో వైసీపీ సఫలమైంది.2024 ఎన్నికల్లో పవన్ ను కచ్చితంగా ఓడించాలని వైసీపీ ఫిక్స్ అయింది.పిఠాపురం( Pithapuram ) వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా ఉండగా ఆమెనే కొనసాగిస్తారో లేక ముద్రగడ కొడుకుకు ఛాన్స్ ఇస్తారో తెలియాల్సి ఉంది.పిఠాపురం నుంచి గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవాలని వైసీపీకి లేదు.
ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురంలో వైసీపీని గెలిపించే బాధ్యతలు తీసుకున్నారని భోగట్టా.టీడీపీ కార్యకర్తలు, నేతల మద్దతును వైసీపీ కోరుకుంటుండగా వైసీపీ కోరుకున్న విధంగా జరుగుతుందో లేదో చూడాలి.టీడీపీ అసంతృప్త నేతలు మద్దతు ఇస్తే పార్టీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.పిఠాపురంలో వైఎస్ జగన్ స్వయంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ను ఓడించడం సాధ్యమైతే పవన్ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ వేయవచ్చని వైసీపీ భావిస్తుండటం గమనార్హం.ముద్రగడ సహాయసహకారాలతో కాపు ఓట్లను చీల్చే దిశగా వైసీపీ అడుగులు పడుతున్నాయి. వైసీపీ ప్లాన్స్ వర్కౌట్ అయితే మాత్రం పవన్ కు ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక కాదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే వైసీపీ నేతల ప్లాన్స్ ను తిప్పికొట్టడానికి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది.
వంగా గీతా( Vanga Geetha ) మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో కచ్చితంగా విజయం సాధిస్తానని చెబుతున్నారు.వైసీపీకి ప్రజల మద్దతు ఉందని ఆమె పేర్కొన్నారు.పిఠాపురంలో జనసేనకు సర్వేలలో ఫలితాలు అనుకూలంగా రాగా సర్వేలను పూర్తిస్థాయిలో నమ్మలేమని విశ్లేషకులు చెబుతున్నారు.వైసీపీ, జనసేన పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు కోసం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయని తెలుస్తోంది.