మధుమేహం ఉన్న‌వారు కొత్తి‌మీర తింటే ఏం అవుతుందో తెలుసా?

ఏ కూర‌లో వేసినా.చ‌క్క‌టి రుచి, వాస‌‌న అందించే కొత్తి‌మీర అంటే అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు.

 Coriander Leaves Helps To Reduce Diabetes! Coriander Leaves, Diabetes, Blood Glu-TeluguStop.com

ముఖ్యంగా నాన్ వెజ్ క‌ర్రీస్‌లో కొత్తిమీర లేకపోతే.ఏదో వెలితిగానే ఉంటుంది.

రుచిలోనే కాదు.ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ కొత్తిమీర గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ముఖ్యంగా మ‌ధుమేహంతో బాధ‌ప‌డే వారికి కొత్తిమీర దివ్య ఔష‌దంలా ప‌ని చేస్తుంద‌ని ఇటీవ‌ల ఓ అధ్య‌య‌నంలో తేలింది.

అవును, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.అందుకే ప్ర‌తిరోజు కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక కొత్తిమీర షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు చేయ‌డం మాత్ర‌మే కాదు.మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా చేకూర్చుతుంది.

కొత్తిమీర తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ త‌గ్గించి.మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

త‌ద్వారా గుండె సంబంధిత జబ్బులు రాకుండా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.అదే స‌మ‌యంలో గుండె ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంది.

అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రిచే విట‌మిన్ ఏతో పాటు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే విట‌మిన్ సి, కె మ‌రియు యాంటీ-ఆక్సిడేంట్స్ కూడా కొత్తిమీర‌లో పుష్క‌లంగా దొరుకుతాయి.

కాబ‌ట్టి, కొత్తిమీర‌ను డైట్‌లో చేర్చుకుంటే మంచిద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అదేవిధంగా, ఒక గ్లాసు మ‌జ్జిగ‌లో కొద్దిగా కొత్తిమీర ర‌సం మిక్స్ చేసుకోవ‌డం వ‌ల్ల నీర‌సం, ఒత్తిడి త‌గ్గుతుంది.

అలాగే ర‌క్త‌పోటు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు కూడా మ‌జ్జిగ‌లో కొత్తిమీర ర‌సం క‌లుపుకుని తాగితే మంచిది.కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం అధికంగా ఉండే కొత్తిమీర‌ను ప్ర‌తిరోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.

ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.ఇక ఇటీవ‌ల కాలంలో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు.

అలాంటి వారికి కూడా కొత్తిమీర బాగా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తిరోజు కొత్తిమీర మ‌రియు పుదీనా కలిపి ర‌సం తీసుకుని తాగితే.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

Coriander Leaves Helps To Reduce Diabetes! Coriander Leaves, Diabetes, Blood Glucose Levels, Latest News, Health, Health Tips, - Telugu Glucose Levels, Coriander, Diabetes, Tips, Latest

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube