ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి.ఇప్పటికే అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి నిందితులను శిక్షించేందుకు దిశా చట్టం అమలులోకి తీసుకు వచ్చినా నిందితులు మాత్రం అం వాటిని లెక్క చేయడం లేదు.
తాజాగా ఓ మహిళను వివస్త్రను చేసి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమె శరీరాన్ని నగ్నంగా రోడ్డుపై పడేసి వెళ్ళిన ఘటన ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణ ప్రాంత పరిసరాల్లో చోటు చేసుకుంది.ఈ వార్త ఒక్కసారిగా ఒంగోలు ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే మంగళవారం రోజున ఒంగోలు పట్టణ పరిసర ప్రాంతంలో ఓ మహిళ వివస్త్రణగా అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని చికిత్స నిమిత్తమై బాధితురాలిని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆమె స్పృహలో లేనందువలన ఏమి జరిగింది అనే విషయం పై సరిగా స్పష్టత రావడం లేదు.అయితే ఇది ఇలా ఉండగా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
అయితే మహిళ అపస్మారకస్థితిలో పడివున్నటువంటి స్థలంలో పోలీసులు ఆధారాలు కోసం గాలిస్తుండగా కొన్ని అనుమానాస్పద వస్తువులు దొరికినట్లు చెబుతున్నారు. దీంతో ఆమెపై పలువురు వ్యక్తులు అత్యాచారం చేసినట్లు భావిస్తున్నారు.అయితే అపస్మారక స్థితిలోకి జారుకున్నటువంటి మహిళ స్పృహలోకి వస్తే అసలు విషయం ఏంటనేది తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.