ఏపీలోని టీడీపీ నేతలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.స్కిల్ డెవలప్ మెంట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రాథమిక ఆధారాలు ఉండటంతోనే కోర్టు చంద్రబాబును రిమాండ్ కు పంపిందని సజ్జల తెలిపారు.చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే టీడీపీ డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదని తెలిపారు.ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.