ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ”పుష్ప 2” ఒకటి.అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప పార్ట్ 1 భారీ లాభాలను తెచ్చి పెట్టింది.
పుష్ప ది రైజ్ 170 కోట్లతో తెరకెక్కించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 380 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది.
దీంతో నిర్మాతలు ఈ సినిమా సీక్వెల్ మీద ఉన్న అంచనాలను చూసి ఈసారి దాదాపు 400 కోట్లతో నిర్మిస్తున్నారని సమాచారం.మరి ఇటీవలే ఈ సినిమా పార్ట్ 2 షూట్ గ్రాండ్ గా వైజాగ్ లో స్టార్ట్ చేసి అక్కడ ఫస్ట్ షెడ్యూల్ ముగించారు.
ఇక రెండవ షెడ్యూల్ ఫిలిం సిటీలో స్టార్ట్ చేసి శరవేగంగా షూట్ చేస్తున్నారు.మరి షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.పుష్ప 2 క్లైమాక్స్ లో బన్నీ కొత్త లుక్ లో కనిపిస్తాడని.అది కూడా మూడో పార్ట్ కి లీడ్ అని టాక్.అంతేకాదు ఈ సీక్వెల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు కొత్త పాత్రలు కూడా పుష్ప 2 లో పరిచయం కానున్నాయి.
ప్రముఖ నటీనటులు ఈ సీక్వెల్ లో కనిపించ నున్నారట.ఏది ఏమైనా బన్నీ తన యాక్టింగ్ తో ఈసారి కూడా మెప్పించడం ఖాయం.అందుకే పుష్ప 2 కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
చూడాలి ఈసారి ఎలాంటి ట్విస్టులతో వచ్చి సుక్కూ మ్యాజిక్ చేస్తాడో.