టీడీపీ నేత నారా లోకేశ్ పై( Nara Lokesh ) మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్( Avanti Srinivas ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లోకేశ్ శంఖారావం సభ( Sankharavam Meeting ) అట్టర్ ఫ్లాప్ అని తెలిపారు.
లోకేశ్ సభకు స్పందన జీరోనన్న ఆయన లోకేశ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలోనే లోకేశ్ కు ధైర్యం ఉంటే భీమిలిలో( Bheemili ) పోటీ చేయాలని ఆయన ఛాలెంజ్ చేశారు.అదేవిధంగా నారా లోకేశ్ ది రెడ్ బుక్( Red Book ) కాదని, ఎర్రి బుక్ అని ఎద్దేవా చేశారు.ఏపీలో రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.