మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలను అంతే వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.
ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.
మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఇక ఇటీవలే కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసినట్టు డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.
పక్కా మాస్ ఎంటర్టైనర్ గా మెగా ఫ్యాన్స్ కోసం బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.అయితే ఇప్పుడు సంక్రాంతి మూడు రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారని సమాచారం.చూడాలి మరీ దీని గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో.







