Milk Tea : నిత్యం మిల్క్ టీ తాగ‌డం వ‌ల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా?

ఉదయం లేవగానే ఒక కప్పు టీ( Tea ) తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.కొందరు ఉదయమే కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం వేళ కూడా టీ తాగుతుంటారు.

 Dangerous Side Effects Of Milk Tea-TeluguStop.com

ముఖ్యంగా మిల్క్ తో తయారు చేసిన టీ అంటే అమితమైన ఇష్టాన్ని చూపిస్తుంటారు.కానీ మిల్క్ టీ( Milk Tea ) ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

నిత్యం మిల్క్ టీ తాగడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు.మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

నిత్యం మిల్క్ టీని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.ప్ర‌ధానంగా క‌డుపు ఉబ్బరం, గ్యాస్ మరియు అజీర్తి వంటివి వేధిస్తాయి.

టీలో కెఫిన్( Caffeine ) ఉంటుంది.

Telugu Headache, Tips, Insomnia, Milk Tea-Telugu Health

ఈ పానీయానికి పాలు జోడించ‌డం వ‌ల్ల రెండు గ్యాస్( Gas ) ఉత్ప‌త్తిని ప్రోత్సహిస్తాయి.కడుపును ఉబ్బరంగా చేస్తాయి.అలాగే రెగ్యుల‌ర్ గా మిల్క్ టీను తాగ‌డం వ‌ల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది.

నిద్ర‌లేమి బారిన ప‌డే అవ‌కాశాలు చాలా అధికంగా ఉంటాయి.మిల్క్ టీలో గణనీయమైన మొత్తంలో కొవ్వులు మరియు చక్కెర ఉంటాయి.

నిత్యం మీరు క‌నుక పాలుతో చేసిన టీ తాగితే వెయిట్ గెయిన్( Weight Gain ) అవుతారు.మిల్క్ టీ యొక్క అత్యంత ప్రమాదకరమైన దుష్ప్రభావాలలో డీహైడ్రేష‌న్ ఒక‌టి.

బాడీ డీహైడ్రేట్ అయితే తీవ్ర‌మైన త‌ల‌నొప్పితో స‌హా మ‌రెన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.

Telugu Headache, Tips, Insomnia, Milk Tea-Telugu Health

మిల్క్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అసమతుల్యత ఏర్పడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.ఒక‌వేళ మీకు అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య( Blood Pressure ) ఉంటే ఖ‌చ్చితంగా మిల్క్ టీను తీసుకోవ‌డం ఆపాలి.అంతేకాదు, మిల్క్ టీను అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శరీరం పొడిబారుతుంది.

మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి.మ‌ల‌బ‌ద్ధ‌కం బారిన ప‌డ‌తారు.

ఒత్తిడి పెరుగుతుంది.కాబట్టి పాలు కలిపిన టీని నిత్యం తీసుకోవ‌డం మానుకోండి.

మీరు కావాలి అనుకుంటే బ్లాక్ టీను డైలీ డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube