టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి కూతురు సుప్రీత ప్రస్తుతం పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే సుప్రీత ఇప్పటికే హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించే ఈమెకు తరచూ ఓ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఎప్పుడు ఇవ్వనున్నారు అంటూ పలుమార్లు నెటిజన్లు ప్రశ్నించారు.
తాజాగా సుప్రీత వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది.కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న లేచింది మహిళా లోకం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఇక శుక్రవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి ఈ విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘విప్లవం మొదలైంది‘ అన్న విభిన్న ట్యాగ్‌లైన్‌తో సినిమా షూటింగ్ ప్రారంభమైందని చిత్రబృందం పోస్టర్ విడుదల చేశారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టర్ ను మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి సినిమా ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.ఇకపోతే ఈ సినిమాలో సురేఖ వాణి కూతురు సుప్రీతా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.షార్ట్ ఫిలిమ్స్,ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె మొదటిసారిగా లేచింది మహిళా లోకం అనే సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నారు.







