సాధారణంగా ఎంత పెద్ద నటులైనా కెమెరాను తొలిసారి ఫేస్ చేసే ముందర కొంత భయపడుతుండటం సహజమే.కొందరు అయితే ఏకంగా చాలా భయపడిపోయి పారిపోయిన వారు కూడా ఉన్నారు.
అయితే, తినతినగా వేము తియ్యనుండు అన్న మాదిరిగా, ఒకటి రెండు సార్లు కెమెరా ఫేస్ చేస్తూ చాలు.ఇక కెమెరా ముందర నటించడం వారికి చాలా ఈజీ అయిపోతుంది.
కాగా, చక్కటి నటుడు గిరిబాబు తొలిసారి కెమెరా ఫేస్ చేసే ముందర భయం వేస్తుందనడంతో నిర్మాత ఏం చేశాడో తెలియాలంటే మీరు ఈ స్టోరి చదవాల్సిందే.
‘జగమే మాయ’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో చలికాలం కాగా, విపరీతమైన చలి ఉంది.
సీన్ ప్రకారంగా ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు సీన్ షూట్ చేయాల్సి ఉంది.ఆ సీన్ నటుడు గిరిబాబుదే మెయిన్ రోల్ కాగా ఆయన కూడా రెడీ అయి ఉన్నాడు.
షూట్ జరుగుతున్నది.కానీ, సీన్ మాత్రం సరిగా రావడం లేదు.
ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు టేక్స్ అయిపోయాయి.అయినా సీన్ పండటం లేదు.
దీంతో నిర్మాత పూర్ణచంద్రరావు సీరియస్ అయిపోయారు.వెంటనే గిరిబాబు వద్దకు వచ్చి ఏంటయ్యా ఏం చేస్తున్నావ్ అసలు నవ్వు ఆలస్యం అయిపోతున్నాదని ఫైర్ అయ్యాడు.అలా అనే సరికి గిరిబాబు వణికిపోయాడు.అలానే వణికిపోతున్నాడు.నటుడు గిరిబాబును చూసి చుట్టుపక్కల వాళ్లు నవ్వుకుంటున్నారు.
దాంతో గిరిబాబు చేసేదేమీలేక ప్రొడ్యూసర్ పూర్ణచంద్రరావు వద్దకు వెళ్లి తనకు భయంగా ఉందని, డైలాగ్స్ చాలా పెద్దగా ఉన్నాయని, బాగా చలి వేస్తుందండి, షివరైపోతున్నానని చెప్పాడు.అలా చెప్పగానే ప్రొడ్యూసర్ పూర్ణచంద్రరావు కాసేపు ఆలోచించాడు.ఓ కుర్రాడిని పిలిచి జరిగిన విషయం చెప్పాడు.
ఆ కుర్రాడు లోపలికి వెళ్లి గ్లాసులో జ్యూస్ తెచ్చాడు.అది గిరిబాబుకు ఇవ్వగా కొంచెం తాగాడు.
చేదుగా ఉందని భయపడిపోతుండగా ప్రొడ్యూసర్ పూర్ణచంద్రరావు అరిచాడు.ఏంటయ్యా షివరైపోతున్నావ్ తాగు.
అని అన్నాడు.దాంతో గిరిబాబు మొత్తం తాగేసి హుషారుగా సీన్ కంప్లీట్ చేసేశాడు.
ఆ తర్వాత గిరిబాబు ప్రొడ్యూసర్‌ను జ్యూస్‌లో ఏం వేశారని అడిగాడు.అప్పుడు ప్రొడ్యూసర్ అది బ్రాందీ అని చెప్పాడు.
దాంతో గిరిబాబు సైలెంట్ అయిపోయాడు.అయితే, అప్పటికి గిరిబాబుకు మద్యం తాగే అలవాటు లేదు.