మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన నటిస్తున్న సినిమాలలో గాడ్ ఫాదర్ ఒకటి.
మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇప్పటికే నయనతారకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇందులో నయనతార మెగాస్టార్ చిరంజీవికి మధ్య ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎమోషనల్ సన్నివేశాలలో నయనతార మెగాస్టార్ చిరంజీవితో పోటీపడి మరి నటించారని ఈ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు హీరోయిన్ పాత్రలలో అందరిని మెప్పించిన నయనతార మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.దసరా కానుకగా ఈ సినిమాలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఈ దిశగా షూటింగ్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.







