వైరల్ వీడియోలు ఎన్నున్నా, ఈ వీడియో వేరయా! అన్నట్టుంది ఇక్కడి వీడియో.అవును.
బేసిగ్గా నేరస్తులు అనేవారు ఎక్కడినుండో ఊడి పడరు.పరిస్థితులకు అనుగుణంగా మనలోనుండే పుడతారు.
అయితే గోరుతో పోవలసింది గొడ్డలిదాకా తెచ్చుకుంటారు వీరు.సరిగ్గా ఇక్కడ ఇలాంటి సీన్ ఒకటి జరిగింది.
సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ యువకుడుని ఆపారు ట్రాఫిక్ పోలీసులు.కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.వారు ఏదో అడిగేలోపే ముక్కు పగిలేలా గుద్దాడు.వెంటనే అక్కడినుండి ఉరికాడు.ఈ క్రమంలోనే ఒక సబ్వే ట్రాక్ ఎక్కేసి, అక్కడి నుంచి రోడ్డుపై ఉన్న ఒక బిల్డింగ్ పైకి అమాంతం దూకేసాడు.కట్ చేస్తే ఈ వీడియో ఇపుడు ట్రెండింగ్‌లో ఉంది.
వివరాల్లోకి వెళితే, ఈ ఘటన బ్రూక్లిన్‌లో తాజాగా వెలుగు చూసింది.‘కెండాల్ ఫ్లాయిడ్‘ అనే యువకుడు అలా బిల్డింగ్‌పై దూకేందుకు ప్రయత్నిస్తుంటే.రోడ్డుపై ఉన్న పోలీసులు, జనాలు కేకలు వేస్తూ, అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.కానీ వాళ్ల మాటలు ఏమాత్రం వినలేదు కెండాల్.పోలీసులకు దొరకకూడదు అనుకొని, ఓ డేంజరస్ ఫీట్ వేసాడు.అయినా అతగాడి కాలికి దెబ్బ తగలడంతో వారికి దొరికేసాడు.
దాంతో కాసేపటికే పోలీసులు అతన్ని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
సీట్ బెల్టు లేకుండా డ్రైవ్ చేయడం, పోలీసుపై దాడి చేయడం వంటి రెండు కారణాలతో కేసులు పెట్టారు.ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కెండాల్ ఆరోగ్యం బాగానే ఉందని అధికారులు తెలిపారు.అతను చేసిన ఈ స్టంట్‌ను వీడియో తీసిన కొందరు దాన్ని సోషల్ మీడియాలోషేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
అయితే నెటిజన్లు కెండాల్ సాహసాన్ని ఉపేక్షించట్లేదు.ఎవరన్నా చట్టం ముందు ఒకటే అంటూ క్లాసులు పీకుతున్నారు.కొంతమంది గోరుతో పోవలసింది గొడ్డలిదాకా ఎందుకు తెచ్చుకున్నావు?” అని అతగాడికి హితబోధ చేస్తున్నారు.