జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న కమెడియన్లలో ఒకరైన కిర్రాక్ ఆర్పీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ షోపై, ఆ షో నిర్వాహకులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ వ్యాఖ్యల గురించి స్పందించడానికి హైపర్ ఆది, రామ్ ప్రసాద్ అదే యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
యుద్ధం లేదు కానీ అబద్ధం ఉందని ఆది చెప్పుకొచ్చారు.ఆర్పీ చెప్పింది తప్పు అని చెప్పడానికే వచ్చామని రామ్ ప్రసాద్ తెలిపారు.ఆర్పీ ఆలోచించి మాట్లాడలేదని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.మల్లెమాల మాకు లైఫ్ ఇచ్చిందని ఆది తెలిపారు.
దానిని రివర్స్ లో చెబితే అంతకు మించిన మూర్ఖత్వం లేదని ఆది చెప్పుకొచ్చారు.రాజమౌళి, కొరటాల శివ ఫస్ట్ క్లాప్ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో సినిమాకు క్లాప్ కొట్టిస్తారని ఆది తెలిపారు.
మాకు డబ్బులు అవసరం అయితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి లక్షల రూపాయలు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయని ఆది పేర్కొన్నారు.రష్మీకి మల్లెమాల తరపున అస్యూరెన్స్ ఇచ్చి శ్యామ్ ప్రసాద్ రెడ్డి లోన్ ఇప్పించారని ఆది చెప్పుకొచ్చారు.సుధీర్ కు రెండేళ్ల క్రితం ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వచ్చినా ఫ్రెండ్ షిప్ కోసం వెళ్లలేదని రామ్ ప్రసాద్ తెలిపారు.ప్రస్తుతం సుధీర్ కు వేరే ఛానల్ నుంచి ఫైనాన్షియల్ గా మంచి ఆఫర్ వచ్చిందని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
మాకు ఈటీవీతో పాటు మరో ఛానల్ లో చేయడానికి లేదని ఆది పేర్కొన్నారు. సుధీర్ కు మల్లెమాల అంటే ఎంతో గౌరవం అని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
సుధీర్ కు ఇతర ఛానెల్ లో 50,000 రూపాయల నుంచి లక్ష రూపాయలు ఎక్కువ మొత్తం ఇచ్చే ఆఫర్ వచ్చిందని ఆది వెల్లడించారు.సుధీర్ పై కౌంటర్స్ వేస్తే సుధీర్ కు కెరీర్ అని ఆది కామెంట్లు చేశారు.
డబ్బు కోసమే సుధీర్ ఈటీవీకి దూరమయ్యాడని ఆది, రామ్ ప్రసాద్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.