‘ఈ - వీసా ’ దిశగా యూకే మరో కీలక నిర్ణయం.. వారందరికీ భారీ ఊరట

అంతర్జాతీయ ప్రయాణీకులకు, వలసదారులకు బ్రిటన్ ప్రభుత్వం( UK Government ) బుధవారం శుభవార్త చెప్పింది.ఈ వీసా( eVisa ) విధానంలోకి మారేందుకు గాను మార్చి 2025 వరకు గ్రేస్ పీరియడ్‌ను ప్రవేశపెట్టింది.

 Uk Govt Introduces Grace Period For Evisa Transition Until March 2025 Details, U-TeluguStop.com

ఈ సమయంలో వీసాదారులు పూర్తిగా ఆన్‌లైన్ ఈ వీసా సిస్టమ్‌కు మారడం వల్ల అంతర్జాతీయ ప్రయాణానికి గడువు ముగిసినా ఫిజికల్ డాక్యుమెంటేషన్‌ను అంగీకరిస్తామని తెలిపింది.హోమ్ ఆఫీస్ డ్రై వ్‌లో భాగంగా.

వీసాదారులంతా (భారతీయులతో సహా) ఫిజికల్ బయోమెట్రిక్ రిసిడెన్స్ పర్మిట్ (బీఆర్పీ), వీసా విగ్నేట్ స్టిక్కర్, ఇంక్ స్టాంప్‌తో కూడిన పాస్‌పోర్ట్‌ని ఉపయోగించి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.బయోమెట్రిక్ రెసిడెన్స్ కార్డ్ (బీఆర్సీ)( Biometric Residence Card ) ద్వారా వారి ఇమ్మిగ్రేషన్ హక్కులకు సాక్ష్యంగా వుంచి ఈ వీసా విధానంలోకి మారడానికి డిసెంబర్ చివరి వరకు గడువు విధించారు.

Telugu Biometric, Evisa, Grace Period, Uk Evisa, Uk, Uk Nri, Uk Visa, Uk Visa Up

3.1 మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికే ఈ వీసా విధానంలోకి మారారని యూకే హోం ఆఫీస్( UK Home Office ) తెలిపింది.అయితే వీసాదారులు పలు కారణాలతో పాటు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నందున గడువులోగా ఈ వీసాలోకి మారలేకపోయారు.యూకే ఇమ్మిగ్రేషన్ , పౌరసత్వ శాఖ మంత్రి సీమా మల్హోత్రా( Minister Seema Malhotra ) మాట్లాడుతూ.

ఇంకా వీసాలోకి మారని వారికి విస్తృత శ్రేణి మార్గదర్శకం, మద్ధతు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.వీసాదారులు, ఎంపీల అభిప్రాయాన్ని తాను తెలుసుకుంటున్నానని.ఇది సజావుగా జరిగేలా చూసుకోవడానికి చర్యలు చేపట్టినట్టు సీమా అన్నారు.సరిహద్దు భద్రతపై రాజీపడకుండా , అంతర్జాతీయంగా ప్రయాణించే వారికి మార్పులను సులభతరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Telugu Biometric, Evisa, Grace Period, Uk Evisa, Uk, Uk Nri, Uk Visa, Uk Visa Up

మెజారిటీ బీఆర్పీల గడువు ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుంది, అలాగే యూకే వీసా అండ్ ఇమ్మిగ్రేషన్ (యూకేవీఐ)( UK Visas and Immigration ) ఆన్‌లైన్ ఖాతాని సృష్టించడం , యాక్సెస్ చేయడానికి, దశలవారీగా ఆన్‌లైన్‌లో ఆటోమెటిగ్గా బదిలీ చేయబడుతున్నాయి.అయితే అప్పటి వరకు ప్రయాణీకులు సాధారణ ఇమ్మిగ్రేషన్ తనిఖీలకు లోబడి ఉంటారని హూం ఆఫీస్ తెలిపింది.పేపర్ వీసా హోల్డర్లు GOV.UK ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఈ వీసా నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి, స్విచ్ చేయడానికి ప్రభుత్వం ఈ వారం మరోసారి విజ్ఞప్తి చేసింది.

ఈ వీసాకు మారడం పూర్తిగా ఉచితమని.ఇది మరింత ప్రయోజనాన్ని అందించడంతో పాటు ఖచ్చితత్వంతో ఉంటుందని అధికారులు తెలిపారు.ఈ వీసాని పొగొట్టుకోవడం, దొంగిలించడం, తారుమారు చేయడం సాధ్యం కాదని.వీసాదారులు తమ ఇమ్మిగ్రేషన్ హక్కులను సురక్షితంగా ఉంచుకోవడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube