ఆ ఆరోగ్య సమస్యతో కూడా బాధ పడిన సమంత.. అయ్యో ఇంత ఇబ్బంది పడ్డారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో సమంత( Samantha ) ఒకరు అనే సంగతి తెలిసిందే.ఈ క్రేజీ హీరోయిన్ ప్రస్తుతం మయోసైటిస్( Myositis ) వ్యాధి నుంచి కోలుకుంటూ త్వరలో వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ కానున్నారు.

 Star Heroine Samantha Health Issues Details, Samantha, Samantha Health Issues ,h-TeluguStop.com

అయితే పదేళ్ల క్రితమే సమంత మరో ఆరోగ్య సమస్యతో బాధ పడ్డారట.నిర్మాత బెల్లంకొండ సురేష్( Bellamkonda Suresh ) మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతుండటం గమనార్హం.

అల్లుడు శీను( Alludu Seenu ) సినిమా సమయంలోనే సమంతకు చాలా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చిందని ఆయన తెలిపారు.ఆ సమయంలో సమంత ఒక చర్మ సమస్య బారిన పడ్డారని ఆయన పేర్కొన్నారు.

అప్పుడు నేను హెల్ప్ చేశానని బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.ఆ సమయంలో సమంత బయట ఉంటే ఇబ్బంది అని భావించి ఆమె కోసం స్టార్ హోటల్ లో రూమ్ తీసి అక్కడ ఉంచానని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు.

Telugu Alludu Seenu, Samantha, Samantha Skin-Movie

ఆ సమయంలో సమంతకు డబ్బులు చాలా అవసరం అని ఇద్దరు ముగ్గురు నిర్మాతలను సమంత డబ్బు విషయంలో సహాయం కోరినా ఎవరూ ఇవ్వలేదని అన్నారు.ఆ సమయంలో 25 లక్షల రూపాయలు నేను సాయం చేశానని 3 నుంచి 4 నెలల్లో సమంత ఆ సమస్య నుంచి కోలుకుందని ఆయన వెల్లడించారు.ఇప్పటికీ సమంత తమ కుటుంబ సభ్యురాలని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు.

Telugu Alludu Seenu, Samantha, Samantha Skin-Movie

సమంతకు ఇచ్చిన 25 లక్షల రూపాయలను రెమ్యునరేషన్ భాగంగా సర్దుబాటు చేసుకున్నానని ఆయన వెల్లడించారు.సమంత కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.సమంత కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉన్నారు.సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube