ఈ హెయిర్ వాష్ పౌడర్ తో జుట్టు సమస్యలు అవుతాయి పరార్..!

వాతావరణంలో వచ్చే మార్పులు, రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, పోషకాల కొరత, ఒత్తిడి, రసాయనాలు నిండి ఉన్న షాంపూలను వినియోగించడం తదితర కారణాల వల్ల మ‌న‌ల్ని వివిధ జుట్టు సమస్యలు( Hair Problems ) వేధిస్తుంటాయి.ముఖ్యంగా హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్, డాండ్రఫ్, హెయిర్ గ్రోత్ సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలతో బాగా ఇబ్బంది పెడుతుంటారు.

 Hair Problems Will Go Away With This Hair Wash Powder Details, Hair Wash Powder-TeluguStop.com

అయితే వీటికి చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ వాష్ పౌడర్( Natural Hair Wash Powder ) చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.మరి ఇంతకీ ఆ పౌడర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

Telugu Fenugreek Seeds, Green Gram, Care, Care Tips, Fall, Problems, Wash Powder

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు పెసలు( Green Gram ) వేసుకుని మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు మెంతులు,( Fenugreek Seeds ) ఒక కప్పు గింజ తొలగించిన కుంకుడు కాయలు,( Soap Nuts ) ఒక కప్పు శీకాకాయ, ఒక కప్పు ఎండిన కరివేపాకును మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న అన్ని పదార్థాలను వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు మందారం పొడి కూడా వేసి మిక్స్ చేసుకుంటే మన హెయిర్ వాష్ పౌడర్ రెడీ అవుతుంది.

ఈ పౌడర్ ను ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం.

Telugu Fenugreek Seeds, Green Gram, Care, Care Tips, Fall, Problems, Wash Powder

మూడు టేబుల్ స్పూన్లు తయారు చేసుకున్న హెయిర్ వాష్ పౌడర్ తీసుకుని అందులో వాటర్ మిక్స్ చేసి స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.40 నిమిషాల పాటు షవర్ క్యాప్ ధరించి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేశారంటే అద్భుత ఫలితాలు పొందుతారు.

ఈ హెయిర్ వాష్ పౌడర్ జుట్టు రాలడాన్ని, విరగడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చడమే కాకుండా స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.చుండ్రు సమస్యను దూరం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube