మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

చర్మంపై పేరుకుపోయే మృత కణాలను( Dead Skin Cells ) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.లేదంటే చర్మం డల్ గా కాంతి హీనంగా కనిపిస్తుంది.

 These Tips Help To Get Rid Of Dead Skin Cells And Giving You Smooth Skin Details-TeluguStop.com

చర్మ ఆరోగ్యం దెబ్బ తింటుంది ఈ నేపథ్యంలోనే మృత కణాలను పోగొట్టి మృదువైన మెరిసే చర్మాన్ని అందించడానికి సహాయపడే ఉత్తమ చిట్కాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Cucumber, Skin, Healthy Skin, Milk Powder, Skin Care, Skin Care Tip

రెమెడీ 1:

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి( Rice Flour ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు టీ డికాషన్( Tea Decoction ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.

చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.

Telugu Tips, Cucumber, Skin, Healthy Skin, Milk Powder, Skin Care, Skin Care Tip

రెమెడీ 2:

మిక్సీ జార్ లో నాలుగు కిరా దోసకాయ( Cucumber ) స్లైసెస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్,( Milk Powder ) వన్ టీ స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ల‌తో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించిన‌ కూడా మృత కణాలు తొలగిపోతాయి.చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.పైగా కీరా చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

డ్రై స్కిన్ తో బాధపడే వారికి ఈ రెమెడీ చాలా బాగా సెట్ అవుతుంది.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube