పుష్ప ది రూల్ మూవీని ప్రదర్శించడం లేదు.. ప్రసాద్ మల్టీప్లెక్స్ షాకింగ్ నిర్ణయం వైరల్!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు, సినీ సెలబ్రిటీలకు ప్రసాద్ మల్టీప్లెక్స్( Prasad Multiplex ) ఎంతో ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమందికి ప్రసాద్ మల్టీప్లెక్స్ తో మంచి అనుబంధం ఉంది.

 Prasads Multiplex Shocking Decision About Pushpa The Rule Movie Details, Prasads-TeluguStop.com

అయితే మైత్రీ నిర్మాతలతో( Mythri Producers ) ఏర్పడిన సమస్య వల్ల ప్రసాద్ మల్టీప్లెక్స్ పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీని ప్రదర్శించడం లేదని క్లారిటీ ఇచ్చింది.ఆలస్యంగానైనా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో బుకింగ్స్ మొదలవుతాయని చాలామంది ఫీలయ్యారు.

Telugu Allu Arjun, Hyderabad, Kanguva, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

అయితే పుష్ప ది రూల్ సినిమాను తమ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించడం లేదని ప్రసాద్ మల్టీప్లెక్స్ తేల్చి చెప్పింది.ప్రసాద్ మల్టీప్లెక్స్ తన పోస్ట్ లో సినీ ప్రేమికులకు అత్యుత్తమమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి వర్క్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.కొన్ని అనివార్య కారణాల వల్ల పుష్ప ది రూల్ ను ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించలేకపోతున్నామని పేర్కొన్నారు.

Telugu Allu Arjun, Hyderabad, Kanguva, Pushpa, Pushpa Rule, Sukumar-Movie

మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని మల్టీప్లెక్స్ నిర్వాహకులు చెపుకొచ్చారు.రెవిన్యూకు సంబంధించి ఏర్పడిన అభిప్రాయ బేధాల వల్ల మాత్రమే పుష్ప2( Pushpa 2 ) ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శించబడటం లేదు.కంగువ మూవీ రిలీజ్ సమయంలో ఆ సినిమాకు సైతం ఇదే తరహా సమస్యలు ఎదురయ్యాయి.

పుష్ప ది రూల్ మూవీకి పైరసీ వల్ల కొంతమేర నష్టం కలుగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టాక్ పాజిటివ్ గా రావడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

భారీ టికెట్ రేట్ల నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube