బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద( MLAs are KP Vivekananda ) , సెంబిపూర్ రాజు , మాజీ మంత్రి హరీష్ రావు ( Former minister Harish Rao )ల అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ నేడు ప్రత్యేక ధర్నా కార్యక్రమానికి ప్లాన్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూస్తున్న తమ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది.
ఈ నేపథ్యంలోనే భారీ ధర్నా కార్యక్రమానికి బీ ఆర్ ఎస్ పిలుపునిచ్చింది.దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కీలక నేతల ఇళ్వల వద్ద పోలీసులను మోహరించారు.నాయకులందరూ బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు.ధర్నా కార్యక్రమంలో ఎవరు పాల్గొనకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు .నిన్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసినందుకు నిరసనగా నేడు ట్యాంక్ బండ్ పై నిరసనకు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది నిరసనల్లో పాల్గొనేందుకు వస్తున్న నేతలందరినీ పోలీసులు వారి ఇళ్ళ వద్ద నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ,ఎమ్మెల్యే శంబిపూర్ రాజు,( MLA Shambipur Raju ) మాజీ మంత్రి హరీష్ రావు , కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కొంపల్లి దండేమూడి ఎన్ క్లేవ్ లోని కేపీ వివేకానంద ఇంటి ముందు పోలీసులను భారీగా మోహరించారు.ఇది ఇలా ఉంటే నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హరీష్ రావు , పల్లా రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.కౌశిక్ రెడ్డికి నాంపల్లి కోర్టు అర్ధరాత్రి బెయిల్ మంజూరు చేయగా, సాయంత్రం హరీష్ రావు, పల్ల రాజేశ్వర్ రెడ్డిలను పోలీసులు విడుదల చేశారు తమపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ,నేడు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
దీంతో ఈ కార్యక్రమాన్ని అందుకునేందుకు పోలీసులు అంతే స్థాయిలో అప్రమత్తం అయ్యారు.