ఇటీవల థాయిలాండ్-మయన్మార్ సరిహద్దు( Thailand-Myanmar Border ) సమీపంలో ఓ విచిత్ర ఘటన జరిగింది.ఒక చైనీయుడు( Chinese ) మూడు రోజుల పాటు ఒక పాత బావిలో ఇరుక్కుపోయాడు.
ఆ ప్రాంతంలోని గ్రామస్థులు అడవి భావి నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని విని షాక్‌కి గురయ్యారు.అవి దెయ్యాల ఏడుపులేమోనని అటువైపు వెళ్లడమే మానేశారు.
చివరికి, ఆ వ్యక్తిని పోలీసులు రక్షణ బృందాన్ని పంపి రక్షించారు.ఆ వ్యక్తి పేరు 22 ఏళ్ల లియు చువాన్‌యి అని తెలిసింది.
రెస్క్యూ టీమ్ అతడిని పిలిచినప్పుడు ఒక శబ్దం వినిపించింది.ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్లి చూస్తే 12 మీటర్ల లోతున్న బావిలో లియు చువాన్‌యి( Liu Chuanyi ) ఉన్నాడు.
అతన్ని రక్షించడానికి 30 నిమిషాలు పట్టింది.
మూడు రోజులు బావిలో మంచినీళ్లు కూడా లేక లియు చువాన్‌యి చాలా బలహీన పడిపోయాడు.అతని చేయి విరిగింది, తలకు దెబ్బ తగిలింది, శరీరం అంతా గాయాలు అయ్యాయి.బహుశా అతడు పైనుంచి పొరపాటున ఇందులోకి పడిపోయి ఉంటాడు.
మూడు రోజులు ఆహారం, నీరు లేక దారుణంగా చిక్కిపోయాడు.అందుకే రక్షించిన తర్వాత అతన్ని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ మూడు రోజులూ లియు చువాన్‌యి ప్రతి గంటకూ సహాయం కోసం కేకలు వేశాడు.కానీ, గ్రామస్థులు ఆ శబ్దాలు దెయ్యాలవి అనుకుని భయపడి ఇళ్లలోనే ఉండిపోయారు.
అందుకే ఎవరూ ఆ శబ్దం వచ్చిన దిశగా వెళ్లలేదు.చివరికి ఎవరో కంప్లైంట్ ఇవ్వడం వల్ల అతను రక్షించబడ్డాడు.
అధికారుల అభిప్రాయం ప్రకారం, లియు చువాన్‌యి అడవి నుంచి బయటకు వెళ్లే దారి కోసం వెతుకుతూ ఉండగా ప్రమాదవశాత్తు బావిలో( Well ) పడిపోయి ఉండవచ్చు.అతను ఆ సరిహద్దు దగ్గర ఎందుకు ఉన్నాడో ఇంకా స్పష్టంగా తెలియదు.ఈ విషయంపై ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, స్థానిక అధికారులు ఆ బావిని మూసివేశారు.
ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది.చాలామంది లియు చువాన్‌యి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
ఒకరు, “మూడు రోజులు ఇలా బతికేయడం చాలా అద్భుతం” అని కామెంట్ చేశారు.మరొకరు, “గ్రామస్థులు దీన్ని మంత్రగాడు మంత్రాలు చేస్తున్నట్లు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు!” అని వ్యాఖ్యానించారు.