కరోనా ఉపద్రవం తరువాత భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా స్టార్ట్ అయింది.జనాలలో రానురాను పర్యావరణ హితం పట్ల అవగాహన పెగుతుండటంతో, మరోవైపు ఆయిల్ ధరలు ఆకాశాన్నంటడంతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజురోజుకీ పెరగుతున్నాయి.
ఈ క్రమంలోనే వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్( Electric Scooter ) లేదా మోటార్ సైకిల్, లేదా ఎలక్ట్రిక్ కార్ లేదా త్రీవీలర్ లేదా ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు, బ్యాటరీతో నడిచే వాహనాలను విస్తృతంగా కొనుగోలు చేస్తున్నారు.దాంతో భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ 2027 నాటికి 35-40 శాతం వృద్ధి చెందుతుందని సర్వేలు చెబుతున్నాయి.

అవును, 2025 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు వాల్యూమ్‌లు 3-4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం, భారతీయ ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మార్కెట్ ద్విచక్ర వాహనం, త్రీ-వీలర్ EV సెగ్మెంట్‌పై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇది వాహన మార్కెట్లో 80 శాతం వాటాను కలిగి ఉంది.ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.సరిగ్గా ఇటువంటి తరుణంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి( Mukesh Ambani ) చెందిన జియో కంపెనీ( Jio ) అత్యాధునిక చౌక ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే… కేవలం రూ.14,999 ధరకు మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో పలు కధనాలు వెలువడుతున్నాయి.అవును, జియో భారత మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది.
ఈ స్కూటర్ ధర తోపాటు వాహన ఫీచర్లు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రాసెస్‌తో సహా ఇతర సమాచారం మొత్తం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇక ఈ స్కూటర్ ఆర్థికంగా మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
అయితే దీనిపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.కాగా జియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.14,999 మొదలుకుని రూ.17,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.







