సినిమాని సినిమాలాగే చూడండి... నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన పుష్ప2( Pushpa 2 ) హవ కొనసాగుతోంది.బన్నీ నటించిన ఈ సినిమా గత అర్ధరాత్రి నుంచి షోలు పడటంతో అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

 Nagababu Shares Indirectly Tweet On Pushpa 2 Movie Details, Allu Arjun, Nagababu-TeluguStop.com

ఇక ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కూడా వస్తోంది.అయితే గత కొంతకాలంగా బన్నీ విషయంలో మెగా కుటుంబం దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు మెగా కుటుంబం మద్దతు ఉండదని అందరూ భావించారు.

కానీ ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు నుంచి మెగా కుటుంబ సభ్యులు ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Telugu Allu Arjun, Alluarjun, Allu Fans, Fans, Nagababu, Nagababu Pushpa, Pushpa

నిన్న ఉదయం మెగా హీరో అయినటువంటి సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) అల్లు అర్జున్( Allu Arjun ) సుకుమార్ అండ్ పుష్ప టీం కి విషెస్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా మరి కొన్ని గంటలలో విడుదల కాబోతుందన్న నేపథ్యంలో నాగబాబు( Nagababu ) కూడా పరోక్షంగా పుష్ప సినిమాని చూడాలంటూ సందేశం ఇస్తూ ఒక పోస్ట్ చేశారు .ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక నాగబాబు ఈ పోస్టులో ఎక్కడ కూడా పుష్ప సినిమా గురించి ప్రస్తావనకు తీసుకురాకపోయిన పరోక్షంగా ఈ సినిమా గురించి చెప్పారని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Alluarjun, Allu Fans, Fans, Nagababu, Nagababu Pushpa, Pushpa

ఈ వారంలో పుష్ప సినిమా తప్ప మరేలాంటి సినిమాలు విడుదల లేదు.ఇలాంటి తరుణంలోనే ఈయన స్పందిస్తూ.వందలాది టెక్నీషియన్లు, 24 క్రాఫ్ట్స్ కలిసి పని చేసి వేలాది మందికి ఉపాధి కలిగించే సినిమాను విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ ప్రియులు, అభిమానుల మీద ఉందని ఎక్స్ వేదికగా తెలియజేశారు.

అయితే ఎక్కడా కూడా ఈ సినిమా నిర్మాతలను కానీ దర్శకులను కానీ లేదంటే అల్లు అర్జున్ పేరును కూడా ఈయన వాడలేదు.ఇలా ఎక్కడా పుష్ప సినిమా గురించి ప్రస్తావించకపోయిన ఈయన మాత్రం పుష్ప 2 సినిమాని చూసి ఆదరించండనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు.

అయితే ఈ పోస్టుపై బన్నీ ఫాన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube