నాగచైతన్య శోభిత వివాహం... ఎమోషనల్ పోస్ట్ చేసిన నాగార్జున!

అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) శోభిత( Sobhita ) వివాహం ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.ఇక వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 Nagarjuna Shares Emotional Post On Nagachaitanya Sobhita Wedding Details, Nagarj-TeluguStop.com

నాగచైతన్య సరిగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి 8:13 నిమిషాలకు శోభిత మెడలో మూడు ముళ్ళు వేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ మాంగళ్యధారణ సమయంలో నాగార్జున అమల దంపతులతో పాటు వెంకటేష్ సురేష్ బాబు వెంకటేష్ కుటుంబ సభ్యులకు కూడా అక్కడే ఉన్నారు.

Telugu Akkineni, Amala, Nagachaitanya, Nagarjuna, Nagarjunanaga, Sobhita-Movie

ఇలా నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేస్తున్న సమయంలో అఖిల్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ విజిల్స్ వేస్తూ సందడి చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక వీరి వివాహం జరిగిన వెంటనే నాగార్జున( Nagarjuna ) సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

నాగచైతన్య శోభిత కొత్త జీవితం ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది.

Telugu Akkineni, Amala, Nagachaitanya, Nagarjuna, Nagarjunanaga, Sobhita-Movie

నాకెంతో ప్రియమైన చైతన్యకు శుభాకాంక్షలు ఇక మా ఇంట్లోకి అడుగుపెడుతున్న శోభితకు వెల్కమ్ అంటూ రాసుకోవచ్చారు.వీరిద్దరూ సంతోషంగా ఉండాలని తెలిపారు.ఇప్పటికే శోభిత మా జీవితాలలోకి ఆనందాన్ని తీసుకువచ్చింది.

ఇక ఈ ఏడాది తమకు ఎంతో ప్రత్యేకమైన తన తండ్రి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహం ముందే వీరిద్దరి వివాహం జరగడం మాకు ఎంతో ప్రత్యేకం అంటూ ఈ సందర్భంగా నాగార్జున తన కొడుకు పెళ్లి గురించి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇక శోభిత మాత్రం పెళ్లి వేడుకలలో సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబయ్యారనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube