వీడియో: వరుడికి రూ.2.5 కోట్ల కట్నం ఇచ్చిన వధువు.. ఇంకా ఎన్నో బహుమతులు..!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, మీరట్‌ సిటీలో( Meerut ) జరిగిన ఓ ముస్లిం వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే, ఈ వైరల్‌కి కారణం అరుదైన డాన్సులో లేదంటే ఏదైనా గొడవో కాదు.

 Groom Receives Huge Dowry From Bride In Meerut Royal Wedding Video Viral Details-TeluguStop.com

ఈ వివాహం వైరల్ కావడానికి ప్రధాన కారణం కుటుంబం వరుడి కుటుంబం కోసం భారీ ఎత్తున బహుమతులు కట్నాలు( Dowry ) ఇవ్వటమే.ఈ వివాహ వేడుకలో భాగంగా జరిగిన డబ్బు మార్పిడి చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఈ వివాహంలో వరుడి కుటుంబానికి కట్నంగా 2.5 కోట్ల రూపాయలు నగదును వధువు కుటుంబం ఇచ్చినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, జూటా చురై అనే సంప్రదాయం ప్రకారం, వరుడి అక్కలు( Groom Sisters ) 11 లక్షల రూపాయలు బహుమతిగా పొందారు.ఈ సంప్రదాయంలో వధువు కుటుంబం( Bride Family ) వరుడి చెప్పులను తీసుకోవడం ఒక ఆచారం.

అంతేకాకుండా, వివాహం జరిపించిన మౌలానాకు 11 లక్షల రూపాయలు, స్థానిక మసీదుకు 8 లక్షల రూపాయలు దానం చేశారు.

మీరట్‌లోని NH-58 హైవేపై ఉన్న ఒక రిసార్ట్‌లో ఈ వెడ్డింగ్( Wedding ) సెలబ్రేషన్స్ జరిగాయి.అయితే బహుమతులు( Gifts ) కట్నాలు ఇస్తున్న దృశ్యాలను ఎవరో వ్యక్తి చాలా సీక్రెట్ గా రికార్డ్ చేశాడు.ఈ వీడియోలో వివాహ వేడుక సమయంలో నగదు నిండిన సూట్‌కేసులు చేతులు మారుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు.

ఈ లావాదేవీలు జరుగుతుండగా చాలా మంది అతిథులు చుట్టూ గుమిగూడి ఉన్నారు.

ఈ వివాహ వేడుకలో భాగంగా 75 లక్షల రూపాయల విలువైన కారును బహుమతిగా ఇచ్చారు.ఈ వీడియోలో కారు కొనడానికి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు ఎవరో ప్రకటిస్తున్నారు.వధువు కుటుంబం నగదు నిండిన మరిన్ని సూట్‌కేసులు అందజేశారు.

ఈ పెళ్లిలో డబ్బు ఇంత ఎక్కువగా ఖర్చు ఖర్చు చేయడం చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.మీరట్‌లో జరిగిన ఈ ఖరీదైన వివాహంలో వధువు కుటుంబం, ఘజియాబాద్‌కు( Ghaziabad ) చెందినవారు.

ఈరోజుల్లో మామూలు పెళ్లి చేయాలంటేనే చాలామంది కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి.ఇలాంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ వీడియో చాలా చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియో వైరల్( Viral Video ) అయినప్పటికీ, రెండు కుటుంబాలు మీడియాకు దూరంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube