అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప2( Pushpa 2 ) సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఈ సినిమాకు అన్ని ప్రాంతాలలో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు అలాగే చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఒక డైలాగ్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఈ డైలాగ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చంద్రబాబును( Chandra Babu ) ఉద్దేశించి రాసారని తెలుస్తుంది.
ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవి( Silpa Ravi ) కోసం నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై ఎంతో వివాదం నెలకొంది.

ఇక ఈ సంఘటనని ఉద్దేశిస్తూ ఈ సినిమాలో ఈ డైలాగ్ పెట్టారని స్పష్టమవుతుంది.కేశవ నా స్నేహితుడు.నా స్నేహితుడి కోసం నేను వస్తాను దానికి అడ్డు నువ్వు వచ్చినా, నీ బాబు వచ్చినా మీ బాబాయ్ వచ్చినా….నన్నేం పీకలేరు అంటూ పుష్ప క్యారెక్టర్ చెప్పే డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కచ్చితంగా ఈ డైలాగ్ పరోక్షంగా కూటమి నేతలను అలాగే మెగా ఫ్యామిలీని ఉద్దేశించే చేశారని అభిమానులు భావిస్తున్నారు.దీంతో ఈ డైలాగుపై మెగా అభిమానులు ఎంతో కోపంతో ఉన్నారు.

శిల్పా రవి కోసం అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లడంతో పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపకుండా తన ప్రత్యర్థికి మద్దతు తెలిపారని మెగా కుటుంబ సభ్యులు అలాగే జనసేన నేతలు మెగా అభిమానులు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు చేశారు.నేను ఎలాంటి రాజకీయా పార్టీలను చూడలేదు, నా స్నేహితుడి కోసమే వెళ్లాను.స్నేహితుడి కోసం వాళ్లకు ఇచ్చిన మాట కోసం నేను ఎక్కడికైనా వెళ్తానని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వివాదం మాత్రం సర్దుమనగలేదు.దీంతో వారికి కౌంటర్ గానే ఈ డైలాగ్ పెట్టారని బన్నీ ఫాన్స్ భావిస్తుండగా మెగా ఫాన్స్ మాత్రం మండిపడుతున్నారు.