క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసేందుకు వైసీపీ అధినేత జగన్( YCP chief Jagan ) సిద్ధమవుతున్నారు.మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో, వైసిపి శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు.
ఈ క్రమంలో వారిలో ఉత్సాహం పెంచడంతో పాటు, ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనా విధానాలపైన పోరాటాలు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. 2027లో జమిలి ఎన్నికలు( Jamili elections ) వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు ఒక షెడ్యూల్ రూపొందించుకున్నారు.2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల్లో పర్యటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బుధ, గురువారాల్లో తాను నిద్ర చేస్తానని జగన్ ప్రకటించారు.ఇటువంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని , వైసిపి నేతలు ఇప్పటికి ప్రజల్లోకి సగర్వంగా వెళ్లవచ్చని జగన్ పిలుపునిచ్చారు. ( YCP )గత ఎన్నికల్లో 50% ఓట్ షేర్ వస్తే , ఈసారి 40% వచ్చిందని జగన్ పార్టీ నాయకులతో అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమైన జగన్ ఈ విషయాల గురించి వారితో చర్చించారు.” జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలవుతుంది .జిల్లాల్లో నేను నిద్ర చేస్తాను. ప్రతి పార్లమెంటులో ప్రతి బుధ , గురువారాలలో నిద్ర చేస్తాను.అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతాము. ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది .ఆరు నెలల కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది .ఇటువంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నాం.మన పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సదర్వంగా వెళ్లవచ్చు .

ఇచ్చిన హామీలు అన్నీ మనం అమలు చేయడమే దీనికి కారణం .ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అసత్య హామీలు ఇచ్చారు.మనం లబ్ధి చేస్తుంటే వాళ్లు చేస్తామని అబద్ధాలు చెబుతున్నారని మన పార్టీ వారు అప్పట్లో చెప్పారు .అతి నిజాయితీ, అతి మంచితనం మనకు సమస్య అని మన పార్టీ వాళ్లు చెప్పారు. అయితే వాటి వల్లే మరలా వైసీపీ అధికారంలోకి వస్తుంది.పథకాలు ఇవ్వకుండా పథకాలు ఎలా ఉన్నాయని అడుగుతారు అంట. అన్ని వర్గాలు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బంది పడుతున్నాయి ” అంటూ జగన్ అన్నారు.” మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేశాను .బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు , సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేసి బటన్ నొక్కి లబ్ధిదారులకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం.చరిత్రలో వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది? మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.కారణాలను పక్కన పెడితే మనకు గత ఎన్నికల్లో 50% ఓట్ షేర్ వస్తే , ఈసారి 40 శాతం వచ్చింది.జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు .కానీ చంద్రబాబు నాయుడు బిర్యాని పెడతానన్నాడు.అందుకే పొరపాటున చేయి అటువైపు పోయింది.
తీరా చూస్తే పలావు పోయింది.బిర్యానీ కూడా లేదు గవర్నమెంట్ బడులు వద్దు అని పేదవాడు అనుకునే పరిస్థితుల్లోకి నెట్టేశారు.
వైద్యరంగ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వ్యవసాయ రంగం కుదేలు అయ్యింది అని జగన్ విమర్శించారు.