సోషల్ మీడియా ప్రభావంతో ప్రపంచంలో ఏ ఘటన జరిగినా క్షణాల్లో ప్రజలకు చేరుతోంది.ముఖ్యంగా షాకింగ్, భావోద్వేగపూరిత సంఘటనలతో కూడిన వీడియోలు విపరీతంగా వైరల్( Viral Video ) అవుతాయి.
ఈ వీడియోలు సమాజంలోని వివిధ సమస్యలను అందరికీ తెలియజేయడమే కాకుండా, కొన్నిసార్లు చర్చకు దారి తీస్తాయి.అందులో ఒకటి తాజాగా వైరల్ అవుతున్న నవజాత శిశువు( New Born Baby ) ఘటన.ప్రస్తుత కాలంలో మానవత్వం క్రమంగా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది.యువత చెడు వ్యసనాలకు బానిసై నేరాలు చేయడం, ప్రేమ పేరుతో మోసాలు చేయడం సర్వసాధారణమైపోయింది.
తమ తప్పులు బయటపడకుండా ఉండేందుకు మరింత పెద్ద తప్పులు చేస్తున్నారు.మనం రోజూ వివిధ సంఘటనలను చూస్తూనే ఉన్నాం.తాజాగా, ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.ఇటీవల, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బ్యాగు( Cement Bag ) నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికులు భయపడ్డారు.
మొదటగా ఎవరికీ ఆ బ్యాగు దగ్గరకు వెళ్లే ధైర్యం రాలేదు.చివరకు ఓ వ్యక్తి ధైర్యం చేసి బ్యాగు తెరిచి చూడగా అందులో ఓ నవజాత శిశువు ఏడుస్తూ కనిపించింది.
ఆడపిల్ల పుట్టడంతో ఎవరో మూట కట్టి అలా పడేసినట్లు తెలుస్తోంది.ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు.గతంలో కూడా చెత్తకుప్పల్లో, సూట్ కేసుల్లో శిశువులను వదిలిపెట్టిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి.తాజా ఘటనను చూసిన వారంతా ఆగ్రహంతో పాటు బాధను వ్యక్తం చేస్తున్నారు.”ఇలా పిల్లలను చెత్తబుట్టల్లో వదిలిపోయే వారిని కఠినంగా శిక్షించాలి” అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి వైరల్ వీడియోలు సమాజంలో చర్చకు దారి తీస్తున్నాయి.
కొన్ని సంఘటనలు చట్టపరమైన చర్యలకు దారి తీస్తే, మరికొన్ని మానవత్వాన్ని ప్రశ్నించేలా మారుతున్నాయి.