టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కేజీఎఫ్2 మూవీని చూడలేదా.. అలా తప్పుడు ప్రచారం చేస్తూ?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది.భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమా హవా కొనసాగుతోంది.

 Tollywood Star Director Not Respond About Kgf2 Movie Details Here , Kgf2 Movie,-TeluguStop.com

తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ స్పందించి పాజిటివ్ గా కామెంట్లు చేశారు.అయితే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు మాత్రం ఈ సినిమా గురించి స్పందించలేదు.

అయితే ఆయా డైరెక్టర్లు కేజీఎఫ్2 సినిమాను చూడలేదా అనే ప్రశ్నకు మాత్రం చూశారనే సమాధానం వినిపిస్తోంది.

ప్రశాంత్ నీల్ కర్ణాటకలో స్థిరపడినా ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ డైరెక్టర్లలో మారుతి మినహా మరే డైరెక్టర్ ఈ సినిమా గురించి స్పందించడానికి ఇష్టపడలేదు.మరోవైపు కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లకు సంబంధించి ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

వీక్ డేస్ లో కూడా కేజీఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను సాధిస్తోంది.తెలుగు రాష్ట్రాల్లో తక్కువ రేట్లకే ఈ సినిమా హక్కులను విక్రయించారు.

ఇప్పటికే పలు ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా ఈ వీకెండ్ నాటికి మరికొన్ని ఏరియాలలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.అయితే కేజీఎఫ్2 నష్టాలను నిర్మాతలు సలార్ మూవీతో భర్తీ చేయనున్నారంటూ ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.కానీ వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం లేదు.కేజీఎఫ్2 మూవీ అన్ని భాషల్లో సులభంగానే బ్రేక్ ఈవెన్ అవుతోంది.

Telugu Allu Arjun, Kgf, Maruthi, Response, Prashant Neel-Movie

కేజీఎఫ్2 సినిమా ఇప్పటికే 720 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.ఈ వీకెండ్ లో ఈ సినిమాకు కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశం ఉంది.కేజీఎఫ్2 ఫుల్ రన్ కలెక్షన్లు ఏ మేరకు ఉంటాయో చూడాలి.బాహుబలి2, ఆర్ఆర్ఆర్ కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube