జాతిరత్నాలు సినిమాకి ముందు దర్శకుడు అనుదీప్ పెద్దగా ఎవరికి తెలియదు.అంతకు ముందు ఆయన సినిమా కు దర్శకత్వం వహించినా కూడా అనుదీప్ గురించి పెద్దగా పరిచయం లేదు.
ఎప్పుడైతే జాతిరత్నాలు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడో ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర విచిత్రంగా మాట్లాడి అందరిని నవ్వించాడో అప్పటి నుండి అనుదీప్ పై చాలా మందికి శ్రద్ధ, దృష్టి పడింది.అనుదీప్ కాళ్ల కు చెప్పులు వేసుకోడు.
ఈ మధ్య కాలంలో ఆయన సాక్స్ ధరిస్తున్నాడు.ఆయన ఎందుకలా చేస్తున్నాడని విషయం క్లారిటీ లేదు.
ఇక రేపు ప్రిన్స్ సినిమా తో అనుదీప్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ తో అనుదీప్ సినిమాను తెరకెక్కించాడు తమిళం మరియు తెలుగులో ఒకేసారి విడుదల కాబోతుంది.
ప్రిన్స్ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో అనుదీప్ మరో సారి తనదైన శైలి కనబరుచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.తాజాగా అనుదీప్ ఈ సినిమా తో తప్పకుండా సక్సెస్ సాధిస్తానని నమ్మకం తో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
జాతిరత్నాలు సినిమా తన ప్రతిభతో మాత్రమే సక్సెస్ అయిందని.అదృష్టవశాత్తు జాతి రత్నాలు సినిమా సక్సెస్ అవ్వలేదు అని అనుదీప్ నిరూపించుకోవాలంటే ప్రిన్స్ సినిమా తో సూపర్ హిట్ అవ్వాల్సిందే.

ఒక వేళ అనుదీప్ ప్రిన్స్ సినిమా తో సూపర్ హిట్ కాలేక పోతే అప్పుడు కచ్చితంగా జాతి రత్నాలు సినిమా సక్సెస్ క్రెడిట్ హీరో నవీన్ పోలిశెట్టి తో పాటు ఇతర యూనిట్ సభ్యులకు మరియు అదృష్టానికి వెళ్తుంది.కనుక ఈ విషయం లో అనుదీప్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ప్రిన్స్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే తప్పితే అనుదీప్ కెరియర్ ముందుకు సాగడం కష్టం అన్నట్లుగా చర్చ జరుగుతుంది.ఏం జరగబోతుందో చూడాలి.







