టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర సీజన్లతో పోల్చి చూస్తే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతారు.సంక్రాంతి పండుగకు సెలవులు ఎక్కువగా ఉండటంతో పాటు సంక్రాంతికి రిలీజైన సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండటంతో ఈ పండుగకు సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు.
సంక్రాంతి కానుకగా ఇప్పటికే ఆదిపురుష్, వాల్తేరు వీరయ్య సినిమాలు ఫిక్స్ అయ్యాయి.
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
అయితే ఈ పోటీలో వారసుడు సినిమా నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి.దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కానుంది.
ఈ సినిమా ద్వారా తెలుగులో మార్కెట్ ను పెంచుకోవాలని విజయ్ భావిస్తున్నారు.
దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చాలని అనుకున్నా రిలీజ్ డేట్ ను మార్చడం సులువు కాదని తెలుస్తోంది.
చిరంజీవి, బాలయ్య సినిమాల పోటీతో దిల్ రాజు తెగ టెన్షన్ పడుతున్నారని సమాచారం అందుతోంది.మొత్తం నాలుగు సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుండటంతో థియేటర్లను ఏ విధంగా కేటాయిస్తారో చూడాల్సి ఉంది.
వారసుడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రభాస్, చిరంజీవి, బాలయ్య సినిమాలపైనే ప్రేక్షకులు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న సినిమాలకు 500 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగనుందని సమాచారం అందుతోంది.డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలకు భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు.2023 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాల కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







