ఏపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నంబర్ కేటాయించింది.అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత నెలలో ఏపీ సర్కారు 2వేల పేజీలతో ఎస్ఎల్పీ దాఖలు చేసింది.
ప్రభుత్వ పిటిషన్పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకుని రిజిస్ట్రీ ఎస్ఎల్పీ నంబర్ కేటాయించింది.