జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి జుట్టు రాలడమే( Hairfall ) తప్ప కొత్త జుట్టు ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు.

దీని కారణంగా రోజురోజుకు జుట్టు పల్చగా మారిపోతుంటుంది.అయితే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ సీరంను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు ఒత్తుగా పెరగడం( Thick Hair ) కూడా ప్రారంభమవుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి వాటర్ తో ఒకసారి కడగాలి.

ఆపై అందులో అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. """/" / మరుసటి ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న కలబంద, నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసుకోవాలి.

అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది రెడీ అవుతుంది.

"""/" / ఈ న్యాచురల్ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సీరం ను వాడడం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

ఈ సీరం జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

అలాగే ఈ సీరం జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.కురులు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

పైగా ఈ సీరంను వాడటం వల్ల చుండ్రు సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.స్కాల్ప్ హైడ్రేట్ గా, హెల్తీగా మారుతుంది.

మరియు ఈ సీరం జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తుంది.సన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.

తాళి నా మొహాన విసిరికొట్టింది.. 32 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగా.. నటి మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు!